మందమల్లమ్మ చెక్ పోస్ట్ దగ్గర 32 వాహనాలు సీజ్

Published: Friday May 21, 2021
బాలపూర్, మే 20, (ప్రతినిధి) ప్రజాపాలన : అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాహనదారులపై చట్టపరంగా చర్యలు, వాహనాన్ని సీజ్ చేయడం జరుగుతుందని మీర్ పేట్ పోలీస్ స్టేషన్ సీ.ఐ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. బాలపూర్ మండలం మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మందమల్లమ్మ చౌరస్తా చెక్ పోస్ట్లో ని డీజీపీ ఆదేశానుసారంగా రాచకొండ కమిషనర్ సూచనల మేరకు వాహనాలు తనిఖీ చేశారు. మీర్ పేట్ పోలీస్ స్టేషన్ సీ.ఐ, పోలీసు బృందం సిబ్బంది తో లాక్ డౌన్  కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. అనంతరం ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.... మీర్ పేట పోలీస్ స్టేషన్ సంబంధించిన 3 చెక్ పోస్టులు పెట్టారని చెప్పారు. వాహనదారులు అందరూ సహకరించాలిని అంటూ, అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారికి చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఇప్పటివరకు 32 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. 3 చెక్పోస్ట్ లో మూడు షిఫ్టులు ప్రకారంగా పోలీస్ సిబ్బంది డ్యూటీలు చేస్తున్నారని, ప్రజలందరూ వాహనదారులు కరోనా లాక్డౌన్ ను అందరు సహకరించగలరని మీర్పేట్ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి తెలిపారు.