రామంతాపూర్లో పల్లె పల్లెకు ఓబీసీ ఇంటింటికి బీజేపీ

Published: Thursday April 13, 2023
మేడిపల్లి, ఏప్రిల్ 12 (ప్రజాపాలన ప్రతినిధి)
రాష్ట్ర బీజేపీ పార్టీ పిలుపుమేరకు రామంతాపూర్ డివిజన్లో పల్లె పల్లెకు ఓబీసీ ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని డివిజన్ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు వేముల తిరుపతయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు పాల్గొని ప్రధాని నరేంద్ర మోడీ 9 సంవత్సరాలలో  బీసీలకు చేకూర్చిన ప్రయోజనాలను ఇంటింటికి వెళ్లి కరపత్రాలు ద్వారా తెలియజేస్తున్నారు.   ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్, 105వ రాజ్యాంగ సవరణ చట్టం, ఓబీసీ ఆదాయ క్రిమి లేయర్ సవరణ, 27 ఓబిసి మంత్రులు, పిఎస్యులో ఓబీసీలకు రిజర్వేషన్లు, సుపరిపాలన, ఓబీసీ విద్యార్థులకు సైనిక్, నవోదయ మరియు కేంద్రీయ విద్యాలయాల్లో రిజర్వేషన్లు, ఓబీసీ విద్యార్థులకు స్కాలర్షిప్, నీట్ రిజర్వేషన్, ఓబీసీల కోసం వెంచర్ క్యాపిటల్ ఫండ్, సబ్వెన్షన్ స్కీం, ఈపీఎం విశ్వకర్మ కౌశల్ సామాన్ యోజన మొదలగు బీసీలకు  ప్రయోజనాలు చేశారని తెలిపారు. 
ఈ కార్యక్రమంలో రామంతపూర్ డివిజన్ బీజేపీ అధ్యక్షులు బండారు వెంకట్రావు,మేడ్చల్ అర్బన్ జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి రేవు నరసింహ కురుమ, జిల్లా కో కన్వీనర్ తాళ్ల బాలకృష్ణ గౌడ్, డివిజన్ బిజెపి ప్రధాన కార్యదర్శి వులు గొండ నారాయణ దాస్, వీణ, వాక నరసింహారావు, డివిజన్ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి కల్మకళ్ళ లింగం, పరి శ్రీనివాస్, పలుగుల అంజయ్య పటేల్, అల్లాడి నిరంజన్ గౌడ్, తమ్మలి రవి, వెంకన్న, మసిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.