వరి ధాన్యంను రోడ్లపై ఆరబెట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు శంకరపట్నం ఏప్రిల్ 07 ప్రజాపాల

Published: Saturday April 08, 2023

శంకరపట్నం మండలం మెట్టుపల్లి గ్రామంలో శుక్రవారము కేశవపట్నం పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ సందర్శించారు. ఈ సందర్భంగా రోడ్లపై వరి ధాన్యము ఆరబోసిన రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ..రైతులు రోడ్డు పక్కన ధాన్యం ఆరబోయడం వలన రోడ్డుపై వెళ్లే వాహనదారులకు, ప్రయాణికులకు అసౌకర్యం కలగడంతో పాటు, ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉన్నదని, ఒకవేళ రోడ్లపై నిర్లక్ష్యంగా వరి ధాన్యమును ఆరబెట్టే పలు ప్రమాదాల కారణమవుతున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తప్పవు అని స్థానిక ఎస్సై డి చంద్రశేఖర్ మండలములోని రైతులను హెచ్చరించారు. రోడ్లపై వరి ధాన్యాన్ని ఆరబెట్టిన రైతులు ఆరిన వెంటనే వరి ధాన్యాన్ని  తీసివేయాలని అట్టి వడ్లను తమ తమ కల్లలలో పోసుకోవాలని గ్రామల్లోని రైతులకు సూచించారు. మండలలోని రైతులందరు వరి కోతలు ప్రారంభం అయినందున తమ వరి ధాన్యాన్ని వారి వారి వరి కల్లలలోనే వరి ధాన్యంను అరబెట్టుకోవలిని సూచించారు. వరి దాన్యం రోడ్లపై పోయాకుండా, రోడ్లపై ప్రయాణించే వాహనదారులను ప్రమాదాలు జరగకుండా నివారించాలని తెలియజేసారు.