ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి

Published: Thursday November 11, 2021
సిపిఎం పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం 
బోనకల్, నవంబర్ 10 ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరి సాగు సమయం చివరి దశకు చేరుకుని రైతాంగం అంతా ధాన్యాన్ని మార్కెట్కు తరలించే సమయం లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు పరుస్తూ ధాన్యాన్ని కొనుగోలు చేయబోమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరి పండించే రైతుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని సిపిఎం నాయకులు అయా ప్రభుత్వాల తీరుపై మండిపడ్డారు. మంగళవారం గ్రామ పంచాయతీ ఆఫీస్ సెంటర్లో జరిగిన నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో శాఖ సెక్రెటరీ మ్మానేని మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణని కోటి ఎకరాల మాగాణి గా మార్చడమే తన లక్ష్యంగా ప్రకటించారని,కానీ ప్రస్తుతం 50 లక్షల ఎకరాల్లో కూడా వరి సాగు జరగటం లేదని, ఇప్పటికే వరి రైతులు ఆందోళన తో ప్రతిరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. మరోవైపు బీజేపీ తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతానని చెప్పి వాటిని అమలు చేయడం టీఆర్ఎస్ పార్టీ మాటల్లో మాత్రమే రైతు పక్షమని, ఆచరణలో బిజెపి పక్షమేనని. బిజెపి నిర్ణయాలను తూచా తప్పకుండా అమలు చేస్తుందని వారు మండి పడ్డారు. రైతాంగం అంతా రాజకీయాలకతీతంగా వరి రైతుకు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ ఎంపిటిసి జొన్నలగడ్డ సునీత, వైస్ ప్రెసిడెంట్ కారంగుల చంద్రయ్య, ఏడు నూతల లక్ష్మణరావు, కోట కాటయ్య, మహిళా నాయకులు నల్లమోతు వాణి, తమ్మారపు లక్ష్మణరావు, రైతులు తదితరులు పాల్గొన్నారు.