ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి తేదీ 20 ప్రజాపాలన ప్రతినిధి *చర్లపటేల్ గూడలో సంక్షేమ, అభివృద్ధి పనుల కో

Published: Tuesday February 21, 2023

ప్రగతి నివేదన యాత్రలో భాగంగా 30వ రోజు బీఆర్ఎస్ పార్టీ యువనాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి (బంటి)  ఇబ్రహీంపట్నం మండలం, కర్ణంగూడ, చర్లపటేల్ గూడ గ్రామాల్లోని ప్రతిగడప గడపకు తిరుగుతూ ప్రభుత్వం చేసిన సంక్షేమ, అభివృద్ధి పనులను వివరిస్తూ,ప్రజలసమస్యలనుఅడిగితెలుసుకున్నారు.అనంతరం చర్లపటేల్ గూడ గ్రామ చౌరస్తాలో ప్రజలను ఉద్దేశించి మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ  ఇప్పటివరకు 2 మండలాలు, 29 రోజులు, 50 గ్రామాలు, 395 కిలోమీటర్లు పూర్తి చేసుకొని ప్రగతి నివేదన యాత్ర కొనసాగుతుందని అన్నారు. నేడు మీరునామీద చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలను చూసి మాతాత నర్సింహ్మ రెడ్డి బతికిఉంటే చాలా సంతోషించేవారన్నారు.నేను చిన్నతనంలో మీగ్రామంలో ఉండేవాన్ని, ఇక్కడే తిరిగేవాన్ని ఏఏ కాలనీల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలిసిన వాడినని, నాబాల్యంలో ఈగ్రామం ఎలా ఉండేది, ఇప్పుడు ఎట్లా అభివృద్ధి చెందిందో మీరు గమనించాలని అన్నారు. గ్రామంలో పాదయాత్ర చేస్తునప్పుడు తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని మురిసిపోయారు.ప్రజలు ఆశీర్వదించి ఎమ్మేల్యే  మంచిరెడ్డి కిషన్ రెడ్డిని 3సార్లు ఎమ్మేల్యేగా గెలిపించారని, గ్రామాల్లో ప్రజలకు ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకొని తనదృష్టికి తీసుకురావాలని, వాటిని పరిష్కారిద్దామని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి నన్ను మీ గ్రామానికి పంపడం జరిగిందన్నారు.గత 8సంవత్సరాలుగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను, ఎమ్మేల్యే అధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు వివరించటానికి ఆదేవిధంగా ప్రజల సమస్యలను తెలుసుకోవటానికే  ప్రగతి నివేదన యాత్రగా చర్లపటేల్ గూడ గ్రామానికి వచ్చానని బంటి అన్నారు.గత 8సంవత్సరాల నుంచి చర్లపటేల్ గూడ గ్రామంలో బీటీ రోడ్డు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు, మిషన్ భగీరథ త్రాగునీటి పైపులైన్, మరియు మిషన్ కాకతీయ ద్వారా చెరువుల మరమ్మత్తు, పూడికతీత ఇలా అన్ని అభివృద్ధి కార్యక్రమాల కోసం సుమారు 5.37కోట్లు రూపాయలను ఖర్చు చేసిందని అన్నారు. ఎలిమినేడు గ్రామం అంటే ఎంత ప్రేమ ఉందో చెర్లపటేల్ గూడెం అంటే కూడా అంతే ప్రేమ కాబట్టి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం ఇతర అభివృద్ధి పనుల కోసం ఎమ్మేల్యే  10లక్షల రూపాయలను మంజూరు చేశారు.గ్రామంలో ఉన్న పాఠశాలలో మౌళిక వసతుల కల్పన కోసం ఇప్పటికే ఎమ్మేల్యే కిషన్ రెడ్డి  48లక్షల రూపాయలను కేటాయించారు. వచ్చే విద్యా సంవత్సరం వరకు పాఠశాల భవనం నూతనంగా రూపుదిద్దుకుంటుందని, అన్ని వసతులను కల్పిస్తామని అన్నారు. చర్లపటేల్ గూడ నుంచి కర్ణంగూడ వరకు బీటీ రోడ్డు నిర్మాణం చేయటానికి 40లక్షల రూపాయలను ఎమ్మేల్యే  మంజూరు చేశారని, త్వరలో రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభమవుతాయని  అన్నారు.
ప్రభుత్వం, రైతులకు పెట్టుబడి కోసం రైతుబంధు ద్వారా ఎకరానికి 10వేల రూపాయల ఆర్థికసహయం అందిస్తూనే పంటరుణాలను మాఫీ చేయాలనే ఉద్దేశ్యంతో ఈబడ్జెట్లో సీఎం కేసీఆర్  నిధులను కేటాయించడం జరిగింది. ఎవరికైతే 90వేల లోపు రుణాలు ఉన్నాయోవాటిని వచ్చే రెండు నెలలో మాఫీ చేస్తుందని ఆయన అన్నారు.ఈగ్రామం మాఅమ్మమ్మ కంబాలపల్లి ఆండాలమ్మ, తాత నర్సింహ్మ రెడ్డి  సొంతూరు.  మాఅమ్మమ్మ, తాత గార్ల జ్ఞాపకార్థకంగా సొంత నిధులతో ఒక ఆస్పత్రిని నిర్మిస్తామని హమీ ఇచ్చారు. బీఆర్ ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు యంపల్ల నిరంజన్ రెడ్డి, మాజీ పీఏసీఎస్ చైర్మన్ నల్లబోలు అంజి రెడ్డి  చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ప్రగతి నివేదన యాత్రలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చిలకల బుగ్గరాములు, ఏంపీపీ పి.కృపేష్, ప్రధాన కార్యదర్శి జి. భాస్కర్ రెడ్డి, సర్పంచ్ గీతా రాంరెడ్డి, మాజీ సర్పంచ్ గణేష్, గ్రామశాఖ అధ్యక్షులు హరిప్రసాద్ గౌడ్, పీఏసీఎస్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి, జంగయ్య, జెడ్పీటీసీ జంగమ్మ, మహేందర్, రవీందర్, ఆండాలు రాములు, నిర్మల, మహిపాల్, అనిత, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు బీవైఎఫ్ సభ్యులు పాల్గోన్నారు.