రాయికల్ మండలాన్ని రెండు మండలాలుగా చేస్తాం -- ఎమ్మెల్యే సంజయ్ కుమార్

Published: Monday July 25, 2022

రాయికల్, జూలై 24 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ మండలం చాలా పెద్దది జగన్నాథపుర్ మొదలుకొని సింగర్రావుపేట గ్రామం వరకు సుమారు 30 కిలోమీటర్ల పొడవుతో కూడుకున్న పెద్ద మండలం గా ఉందని,రాయికల్ పట్టణంలో ఆదివారం ఆర్.ఆర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే డా: కే సంజయ్ కుమార్ మాట్లాడుతూ గత నాలుగైదు సంవత్సరాలలో రాయికల్ పట్టణం చాలా అభివృద్ధి చెందిందని  12 కోట్ల రూ.ల విలువగల అభివృద్ధి పనులు చేశామని దాంట్లో భాగంగా 11 కోట్ల రూ.ల తోసి.సి రోడ్లు, 6.50 కోట్ల రూ.ల టెండర్లు  ఖరారైనవని,పట్టణంలో సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేశామని 1కోటి 50 లక్షల రూ.లతో పెద్ద చెరువును మినీ ట్యాంక్ బాండ్ గా,80 లక్షల రూ.లతో మరో స్మశాన వాటిక ఏర్పాటుచేస్తున్నామని ఇప్పటికే మౌలిక వసతులు మెరుగుపడ్డాయని ఆయన తెలిపారు.రాయికల్ మండలాన్ని రెండు మండలాలుగా చేయాలన్న డిమాండ్ తో కూడిన ప్రతిపాదనలు వచ్చాయన్నారు,దానికి అనుగుణంగా పరిశీలించి సమీక్ష చేస్తే వడ్డె లింగాపూర్ గ్రామానికి రెవెన్యూ స్థలం లేదని పక్కనే ఉన్న భూపతిపూర్ గ్రామానికి రెవెన్యూ స్థలం ఉన్నది,ఈ విషయంపై ప్రజల అభిప్రాయాలు, భిన్నభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత అందరిని ఏక అభిప్రాయానికి తీసుకువచ్చి వడ్డె లింగాపూర్,భూపతిపూర్ గ్రామాల కలయికతో తప్పకుండా నూతన మండలం గా ఏర్పాటు చేస్తామని నూతనంగా ఏర్పాటు చేసే మండలాలు 7ఎంపీటీసీ స్థానాలు ఖచ్చితంగా ఉండాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ పద్ధతిలో నూతన మండలాలను చేయడానికి సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో రాయికల్ మున్సిపల్ చైర్మన్ మోర హనుమాన్లు,రాయికల్ ఎం.పీ.పీ సంధ్యారాణి, జెడ్.పి.టి.సి అశ్వినిజాదవ్ టి.ఆర్.ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కోల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి తలారి రాజేష్, వివిధ గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు పాల్గొన్నారు.