గ్రామీణ వైద్యుల సమస్యలను పరిష్కరించాలి ఆర్ఎంపీడబ్లూఏ టిఎస్ రాష్ట్ర అధ్యక్షులు రుద్రగాని ఆ

Published: Monday September 19, 2022

బోనకల్ , సెప్టెంబర్ 18 ప్రజా పాలన ప్రతినిధి: రాష్ట్రంలో నెలకొన్న గ్రామీణ వైద్యుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రుద్రగాని ఆంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 428 జిఓ ను సవరించి, గత ప్రభుత్వం ఇచ్చిన శిక్షణు కొనసాగించాలన్నారు. 50 సంవత్సరాలు దాటినా గ్రామీణ వైద్యులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలని పేర్కొన్నారు. అర్హులైన వారికి వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగాల కల్పించాలన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం గ్రామీణ వైద్యుల సంఘాలను జెఏసిగా ఏర్పాటు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బొమ్మినేని కొండలరావు, బోయినపల్లి శ్రీనివాసరావు, గౌరవ అధ్యక్షులు ఆవుకి వెంకటేశ్వర్లు, కోశాధికారి షేక్ హాసేన్, మండల అధ్యక్ష, కార్యదర్శులు మరీదు కిషోర్, షేక్ ఖాసీం, ఉపాధ్యక్షులు జెడిమూర్తి, జిల్లా నాయకులు కొంగర గోపి, కె నారాయణరావు, షేక్ ముజి, పుల్లారెడ్డి, ఏ నాగేశ్వరావు, రహీం, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.