తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి అదర్యంలో కలెక్టర్ శర్వాన్ చౌహాన్ సన్మానం

Published: Wednesday July 20, 2022

జన్నారం జూలై 19, ప్రజాపాలన: మండల కేంద్రంలో  ఎర్పాటు చేసిన పదవి విరమణ సందర్భంగా తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి అదర్యంలో కలెక్టర్ శర్వాన్ చౌహాన్ సన్మానం చేయడం జరిగిందని తెలంగాణ గల్ఫ్ కార్మిక సంక్షేమ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కల్లేడ భూమయ్య మంగళవారం అన్నారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ కలెక్టర్ శర్వాన్ చౌహాన్ బడుగుబలహీన వర్గాల ముద్దు బిడ్డ ఎంతో కష్టపాడి పల్లె నుంచి పట్నంలో ఉన్నతమైన చదువులు చదివి  సాధించి అనేకమైన శాఖలలో పనిచేశారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  ప్రథమ పదంలో  వుండానికి ఎంతో కృషి చేసినారని అయన అన్నారు, పదవి విరమణ పొందిన సందర్భంగా జన్నారం మండల కేంద్రంలో  కలెక్టర్ శర్వాన్ చౌహాన్ శాలువ కప్పి పుష్పంగుచ్చం అందించి సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ గల్ఫ్ సంక్షేమ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కల్లెడ భూమయ్య, అధ్యక్షులు సేపురి గోపాల్, రాష్ట్ర కన్వీనర్ సంద సుదర్శన్, రాష్ట్ర సలహాదారులు మగ్గిడి తిరుపతి, సింగపూర్ శాఖ అధ్యక్షులు కొడిజుట్టు నరేష్ , మండల ప్రధాన కార్యదర్శి దుమ్మల ఎల్లయ్య, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జునుగురి వెంకటేష్, నాయకులు చాట్ల సత్యం, వంగల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.