కన్నాల గ్రామపంచాయతీలో సర్వేనెంబర్ 60 లోని భూమి వివరాలు తెలపండి

Published: Friday December 16, 2022
యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పోచంపల్లి హరీష్.
 
బెల్లంపల్లి డిసెంబర్ 15 ప్రజాపాలన ప్రతినిధి:  గత కొద్ది నెలలుగా బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామపంచాయతీ పరిధిలో వివిధ సర్వే నంబర్ లలో ఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని పలు ఫిర్యాదులు అందుతుండగా, రాత్రికి రాత్రి కన్నాల గ్రామపంచాయతీ సర్వే నంబర్ 60 లోని భూమిని పలువురు కబ్జా చేస్తున్నారని ఆరోపణలు వస్తుండడంతో వాటి వివరాలను తెలిపాలని, బెల్లంపల్లి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పోచంపల్లి హరీష్ స్థానిక మండల రెవెన్యూ అధికారికి సమాచార హక్కు లో భాగంగా సమాచారం ఇవ్వాల్సిందిగా గురువారం విజ్ఞప్తి చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ కన్నాల గ్రామంలోని సర్వే నెంబర్ 60 లో ఉన్న భూమి ప్రభుత్వానిదా, లేక ప్రైవేటు వ్యక్తులదా తెలపాలని, ఆ భూమిలో 1982 నుండి 22 డిసెంబర్ వరకు పహానితో కూడిన సమాచారం ఇవ్వాలని, ఆ భూమిని ఎవరైనా వ్యక్తులకు ప్రభుత్వం ద్వారా కేటాయించినట్లయితే, ఏ పద్ధతిలో కేటాయించారు, వారి పేర్లతో కూడిన సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.