ఆలేరు ఎన్.సి.సి.క్యాడెట్లకు ప్రశంసా పత్రాలు

Published: Thursday September 15, 2022
యాదాద్రి భువనగిరి జిల్లా 14 సెప్టెంబర్ ప్రజాపాలన: ఆలేరు లో ఎన్.సి.సి. విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఆలేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్.సి.సి. కాడెట్లకు బుధవారం నాడు పాఠశాలలో ప్రశంసా పత్రాలు అందజేశారు. 
 
ఎన్.సి.సి. లో చేరడంతో విద్యార్థుల్లో క్రమశిక్షణ దేశభక్తి అలవడుతుందని ఆలేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్. నారాయణ అన్నారు. ఈ నెల ఆరవ తేదీ నుండి 13వ తేదీ వరకు వరంగల్ లోని పోలీసు శిక్షణ కళాశాలలో వరంగల్ ఎన్.సి.సి. పదవ తెలంగాణ బెటాలియన్ నిర్వహించిన సిఏటిసి క్యాంపులో ప్రతిభ కనబరచి ప్రశంస పత్రాలు పొందిన 28 మందిని అభినందించి సర్టిఫికెట్లు అందజేశారు.ఈ
సందర్భంగా ఆలేరు ఉన్నత పాఠశాల ఎన్.సి.సి. అధికారి దూడల వెంకటేష్ ను విద్యార్థులు ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు
 
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్.సి.సి. లో చేరితే విద్యార్థులకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ క్యాంపులో విద్యార్థులకు అనేక అంశాలపై శిక్షణ ఇచ్చారని, ముఖ్యంగా వెపన్ ట్రైనింగ్, ఫైరింగ్, డ్రిల్, సోషల్ రెస్పాన్సిబిలిటీ, పునీత్ సాగర్, పర్సనాలిటీ డెవలప్మెంట్ వంటి అంశాలపై ఎంతో అత్యుత్తమ శిక్షణ ఇచ్చారని తెలిపారు. ఆలేరు పాఠశాల క్యాడేట్లు అందరూ అందరి ప్రశంసలు అందుకున్నారు. అలాగే శిక్షణ శిబిరంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వైష్ణవి, ఆధ్య, అర్చన, భాను, శ్రీజస్విని, కారుణ్య, మనోజ్, భరత్ కుమార్ లతోపాటు 28 మంది క్యారెట్ లకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ సీస గోవర్ధన్ ఉపాధ్యాయులు కోటగిరి శేఖర్, మంద సోమరాజు, యోగేశ్వరరావు, మురళి, నవీన్ కుమార్, రవి, వేణు, శ్యామసుందరి, విజయలక్ష్మి, స్వర్ణలత, మేరీ స్వరూప రాణి, మీరా, కవిత తదితరులు విద్యార్థులను అభినందించారు.