ఘనంగా బాపూజీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలు

Published: Monday October 03, 2022

మంచిర్యాల టౌన్, అక్టోబర్ 02, ప్రజాపాలన:మహాత్మా గాంధీ, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాసం లో గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ నివాళులు అర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ, గాంధీ, శాస్త్రి సిద్ధాంతాలు, ఆశయాలు ఎంతో ఉన్నతమైనవని అన్నారు. వారి ఆశయాలను ముందుకు తీసుకుపోయే బాధ్యత నేటి తరం పౌరులపై ఉందని అన్నారు. దేశ స్వాతంత్ర్యము కోసం   చేసిన పోరాటం స్ఫూర్తి దాయకమని కొనియాడారు. అనంతరం గాంధీ పార్కుకు వెళ్లి గాంధీ విగ్రహంకు పూలమాలలు  వేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.