ముస్లీం సోదరులకు రంజాన్ తోఫా పంపిణీ..

Published: Wednesday April 27, 2022
ఔదార్యం చాటుకున్న సమరయోధురాలు బీజాన్ బీ..
తల్లాడ, ఏప్రిల్ 26 (ప్రజాపాలన న్యూస్): తల్లాడ పట్టణానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధురాలు షేక్. బీజాన్ బీ రంజాన్ పర్వదినం సందర్భంగా తల్లాడ మండలంలో ముస్లిం సోదరులకు మంగళవారం రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఆమె భర్త షేక్. అహ్మద్ జ్ఞాపకార్థం వారి కుమారులు, మనువళ్లు అక్బర్, బహుదూర్, బాహార్లీ, ఖదీర్ తదితరులు సుమారు లక్షన్నర విలువచేసే సరుకులను 250 కుటుంబాలకు అందించారు.  మండలంలోని ఎన్టీఆర్ నగర్ కాలనీలో ముస్లిం మతపెద్దలు గాలిబ్ సాహెబ్, జానీపాషా, మజార్ చేతుల మీదుగా వీటిని అందించారు. ఈ సందర్భంగా బీజాన్ బీ మాట్లాడుతూ రంజాన్ పండుగను ప్రతిఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. దీంతో ముస్లిం సోదరులు ఆమెకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లింమత పెద్దలు పైజామ్, అన్వర్, జాన్ పాషా, జానీ తదితరులు పాల్గొన్నారు.