ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 27ప్రజాపాలన ప్రతినిధి *అమరవీరుల సంస్మరణ సభను జయప్రదం చేయాలని సిప

Published: Friday October 28, 2022

సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలోని కామ్రేడ్స్ మహబూబ్ పాషా,నరహరి స్మారక కేంద్రంలో వాల్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సామెల్, మధుసూదన్ రెడ్డి  మాట్లాడుతూ భూమికోసం, భుక్తి కోసం, పేద ప్రజల హక్కుల కోసం వెట్టిచాకిరి విముక్తి కావాలని ప్రజలకు అండగా నిలిచిన ఎర్రజెండా ముద్దుబిడ్డలు మహబూబ్ పాషా,నరహరి గార్లను భూస్వామ్య, మతోన్మాద గుండాలు దారికాచి అత్యంత కిరాతకంగా కత్తులు, గొడండ్లతో నరికి దారుణంగా హత్య చేసి నేటికీ 33 సంవత్సరాలు గడుస్తున్న వారు చేసిన పోరాట స్ఫూర్తితో జిల్లాలో అనేక పోరాటాలు నిర్వహిస్తున్నామన్నారు. ఎర్రజెండా నాయకత్వన పేద ప్రజలకు వందల ఎకరాల భూములను పంచి జీవనోపాధి ప్రజలకు కల్పిస్తే నేటి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పేదలు సాధించుకున్న భూములను పరిశ్రమల పేరుతో కొద్దిపాటి పరిహారం రైతులకు ఇచ్చి భూములను ప్రభుత్వం తీసుకొని పేదలకు అన్యాయం చేస్తున్నారన్నారు. జిల్లాలో పేదలకు ఇళ్ల స్థలాలు, ఇండ్లు, రేషన్ కార్డులు, పింఛన్లు రాక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పేదల భూములను వేలం వేస్తూ ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాలు చేయాల్సి ఉందని అమరవీరుల త్యాగాలను ఎదలోనింపుకొని ఈనెల 28న ఎలిమినేడు గ్రామంలో జరిగే అమరవీరుల సంస్కరణ సభకు ముఖ్య అతిథులుగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్ వెస్లీ, జిల్లా కార్యదర్శి కాడిగళ్ళ భాస్కర్ హాజరవుతున్నారు. కనుక ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు జగన్, మండల కార్యదర్శి జంగయ్య, మున్సిపల్ కార్యదర్శి ఎల్లేశ, సిపియంపార్టీ మండల నాయకులు బుగ్గరాములు, వెంకటేష్, ముసలయ్య, జంగయ్య, రామకృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.