అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన

Published: Saturday May 29, 2021
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజాపాలన ప్రతినిధి : శుక్రవారం కాంగ్రెస్ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన -దళిత వ్యతిరేకి కేసీఆర్ -టి ఎస్ పి ఎస్సీ పాలక మండలిని రద్దు చేయాలి- బర్రె జహంగీర్ ఇటీవల నియమించిన టీ ఎస్ పి ఎస్సీ పాలకమండలి నియామకం లో దళితులకు జరిగిన అన్యాయం పై కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు దర్గాయి హరిప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లే కార్డ్స్, నల్లజెండాలతో  నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ పాల్గొని మాట్లాడుతూ దళిత ముఖ్యమంత్రి హామీ తుంగలో తొక్కిన కేసీఆర్ దళిత వ్యతిరేక విధానాల కొనసాగింపులో భాగంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాలకమండలి సభ్యుల నియామకాల్లో ఈ రాష్ట్రంలో 16 శాతం పైగా ఉన్న దళితులకు చెందిన ఒక్క సభ్యున్ని కూడా కేటాయించకపోవడం యూనివర్సిటీ వీ.సీ.ల నియామకాల్లో కూడా మొక్కుబడిగా ఒకే ఒక వి.సీ.ని నియమించడం దళితులను అణగదొక్కడమే అని టి ఎస్ పి ఎస్సీ,యూనివర్సిటీ విసి ల నియామకాల్లో సామాజిక న్యాయాన్ని తుంగలో తొక్కారని సాక్షాత్తు టిఆర్ఎస్ మంత్రులకు కూడా వీరందరూ ఎవరో తెలియక పోవడం కెసిఆర్ నియంత పాలనకు నిదర్శనమని వెంటనే వి.సి.ల నియామకాల్ని టి ఎస్ పి ఎస్సీ పాలకమండలిని రద్దు చేసి సామాజిక న్యాయం పాటించి నూతన సభ్యులను వి.సి లని నియమించాలని లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఈరపాక నర్సింహా, నాయకులు కొల్లూరి రాజు, దండు నరేష్, కాకునూరి మహేందర్, కాసగళ్ల చందు, అందె నరేష్, దర్గాయి దేవేందర్, చిలువేరు రమేష్, శ్రీ రామ్ బాల్ రాజ్, గ్యార మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.