భువనగిరి అనంతారంలో రోటరీ క్లబ్ సేవలు

Published: Saturday August 20, 2022
యాదాద్రి భువనగిరి జిల్లా 18 ఆగష్టు ప్రజాపాలన:  రొటేరియన్ కార్యదర్శి
పక్కీర్ కొండల్ రెడ్డి  గారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం గా విద్యార్ధులకు స్టడీ మెటీరియల్స్ అందజేశారు.రోటరీ క్లబ్ 
భువనగిరి కోశాధికారి ఎండి.హనీఫ్ మెమన్  పుట్టిన రోజు సందర్బంగా  మరియు పక్కీర్ కొండల్ రెడ్డి కార్యదర్శి గార్ల తల్లిదండ్రుల జ్ఞాపకార్థం గ్రామ వికాస ప్రాజెక్టు లో భాగంగా భువనగిరి మండలం లోని అనంతారం  జిల్లా ప్రజా పరిషత్తు ఉన్నత పాఠశాల,  ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడీ కేంద్రంలో దాదాపు   రూ.18000 విలువ గల (03) అల్మారా లు అసిస్టెంట్ గవర్నర్ గడ్డం జ్ఞాన ప్రకాష్ రెడ్డి  పక్కీర్ కొండల్ రెడ్డి కార్యదర్శి, ఎండి హనీఫ్ మెమన్ కోశాధికారి సమక్షంలో ప్రధానోపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలకు అందజేశారు.తదుపరి విద్యార్థుల కు పరీక్ష ప్యాడ్స్ అందజేశారు. విశాల్ హృదయం తో విద్యార్థులకు తోడ్పాటు అందించిన రోటేరియన్ల కు పలువురు ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు.