నిరుపేద చిన్నారిని ఆదుకోండి

Published: Thursday March 25, 2021
వెల్గటూర్, మార్చి 24 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం జగదేవుపేట గ్రామములోని ఓ పేద కుటుంబానికి అనుకోని ఆపద వచ్చింది. చెన్న శ్రీనివాస్ అను అతనికి 6 రోజుల క్రితం జగిత్యాల సివిల్ హాస్పిటల్ లో బాబు జన్మించాడు. అయితే అత్యవసరంగా బాబుకు గుండె కు సంబంధించి చికిత్స చేయాల్సి ఉంటుందని, దానికి దాదాపు 6 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అసలే రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిలో ఉన్నా మేము ఇంత ఖర్చు ఎలా భరించగలం అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సహాయం చేయగలరని వేడుకుంటున్నారు. దాతలు సహాయం అందించాల్సి నెంబర్లను గూగుల్ పే 7675053742, ఫోన్ పే 9912840662, అకౌంట్ నంబర్ 38568076392 ఐ.ఎఫ్.ఎస్.సి.ఎస్.బి.ఐ.ఎన్.ఒ.ఒ.20604 పేరు చిన్న శ్రీనివాస్ తండ్రి వెంకటేష్ ఈ నెంబర్ కు దయచేసి ఆర్థిక సహాయం చేయగలరని విజ్ఞప్తి చేస్తున్నారు.