గాంధీ థీమ్ పార్క్, మైత్రి క్రీడా మైదానం అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్సి భూపాల్ రెడ్డ

Published: Friday May 28, 2021

పటాన్ చేరు, ప్రజాపాలన ప్రతినిధి : ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనులు చేపడుతూ పటాన్చేరు డివిజన్ ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లడం అభినందనీయమని ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి అన్నారు. గురువారం స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తో కలిసి పటాన్చెరు పట్టణంలో నిర్మిస్తున్న గాంధీ థీమ్ పార్కు, మైత్రి క్రీడా మైదానంలో చేపడుతున్న అభివృద్ధి పనులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా థీమ్ పార్క్, మైత్రి మైదానంలో  చేపడుతున్న పనులను ఎమ్మెల్యే వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ నియోజకవర్గ కేంద్రమైన పటాన్చేరు నడిబొడ్డున ప్రజల ఆహ్లాదం కోసం మూడు కోట్ల రూపాయలతో అన్ని హంగులతో థీమ్ పార్క్ ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. దశాబ్దాల చరిత్రగల మైత్రి క్రీడా మైదానాన్ని స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దడం శుభ పరిణామమని కొనియాడారు. త్వరితగతిన పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ బాలయ్య, మాజీ జెడ్పిటిసి జైపాల్, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.