తల్లిదండ్రులు,పాఠశాల యాజమాన్యం కు ఎర్రుపాలెం పోలీస్ వారి ముఖ్య విజ్ఞప్తి

Published: Saturday March 11, 2023
ఎర్రుపాలెం మార్చి 10 ప్రజాపాలన ప్రతినిధిి మండలంలో అన్ని గ్రామాల పోలీసు వారి ప్రజలకు విజ్ఞప్తితల్లితండ్రులువీధి కుక్కల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఎస్ఐ ఎం సురేష్.
ఇటీవల కాలంలో కుక్కలు వీర విహారం చేస్తూ ఒంటరిగా వెళ్తున్న వృద్ధులను పిల్లలని స్వైర విహారం చేస్తూ కరుస్తూ కాటేస్తూ దాడిచేస్తు కొరికి చంపేస్తు బీభత్సం సృష్టిస్తున్నాని టీవీల్లో వార్తల్లో సామాజిక మాధ్యమాల్లో ప్రతినిత్యం మనం చూస్తూనే ఉన్నందున  పాఠశాలల వద్ద చిన్నపిల్లలను గ్రౌండ్ ఆవరణలో గాని స్కూల్ పరిసర ప్రాంతాల ప్రాంతాల్లో కానీ ఒంటరిగా వదిలేయకుండా యాజమాన్యం పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాలని అలాగే ఇంటి పరిసరాల వద్ద పిల్లల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపించి వీలైనంత సమయంలో బయటికి వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా వచ్చేవి వేసవి సెలవులు కాబట్టి విద్యార్థులకు పాఠశాలలు పునః ప్రారంభం కావడానికి కొంత సమయం పడుతున్నందున చెరువుల వద్ద గాని బావుల వద్ద గాని మీ ఇంటి పరిసరాల చుట్టూ పిల్లల్ని ఒంటరిగా వదిలేయకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ కుటుంబంలో ఎవరైనా పెద్దవారు తోడుగా వెళ్లాలని మనవి ఎర్రుపాలెం. పోలీస్ఎం సురేష్ సబ్  ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్