ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే కఠిన చర్యలు. ఇరిగేషన్ ఏఈ గౌతమ్ మంచిర్యాల బ్యూరో, జనవరి23, ప్రజాపా

Published: Tuesday January 24, 2023
చెరువు శిఖం నారాలను భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని గౌతమ్ హెచ్చరించారు పోచమ్మ చెరువుకు సంబంధించిన అలుగులో మట్టి పోసిభూ ఆక్రమించడం పై రెవెన్యూ అధికారులతో కలిసి ఆయన సోమవారం పరిశీలించారు. భూ ఆక్రమణ కు ప్రయత్నించిన వారిని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం స్థలంలో  అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వాళ్ళ ను హెచ్చరించి తక్షణమే దానిని తొలగించాలని  తెలిపారు. అదే విధంగా పట్టణంలోని చెరువులో,  నాళాలకు సంబంధించిన. స్థలాల్లో అక్ర నిర్మాణాలు గుర్తించి  తొలగించడం జరుగుతుందని తెలిపారు. ఏ అధికారైనా తప్పుడు అనుమతులు ఇచ్చినట్లు భూ అక్రమ దారులు తెలిపినా  ఆ సమాచారాన్ని జిల్లా కలెక్టర్ కు నివేదిక సమర్పించడం జరుగుతుందని ఆయన అన్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత స్థానిక ప్రజలపై ఉందన్నారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురైనట్లు అనుమానం వస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ తనిఖీ లో రెవెన్యూ ఇన్స్పెక్టర్ అజిత్ , వీఆర్వో జశ్వదత్తు, మండల సర్వేయర్ రాంబ్రహ్మం  తదితరులు పాల్గొన్నారు.