రైతు పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ .. తల్లాడ ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు

Published: Wednesday November 30, 2022
తల్లాడ, నవంబర్ 29 (ప్రజా పాలన న్యూస్): 
 రైతు సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని తల్లాడ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం మండలంలోని బిల్లుపాడు (జగన్నాధపురం), అన్నారుగూడెం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలను ప్రవేశపెడుతున్నారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం నుండి ఎటువంటి ఆర్థిక సాయం లేకపోయినప్పటికీ రైతు పథకాలను యధావిధిగా కొనసాగిస్తున్నారని తెలిపారు. నిరంతరం అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్న సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్యతో పాటు రానున్న ఎన్నికల్లో మరోసారి టిఆర్ఎస్ పార్టీని ఆదరించి గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తల్లాడ సొసైటీ చైర్మన్ రెడ్డెం వీర మోహన్ రెడ్డి, వైరా మార్కెట్ వైస్ చైర్మన్ ధూపాటి భద్రరాజు, బిల్లుపాడు ఎంపీటీసీ రుద్రాక్ష బ్రహ్మం, మేడ నరసింహారావు, వేమ శ్రీనివాసరావు, పాకాలపాటి వీరభద్రరావు, దమ్మాలపాటి బాబు, మేడ మోహన్ రావు, జక్కంపూడి నాగేశ్వరరావు, దీవెన కృష్ణమూర్తి, నల్లగొట్ల నగేష్, యలమర్తి కుటుంబరావు,  నాయకులు దొడ్డ చిన్న శ్రీనివాసరావు, మారెళ్ళ దేవేందర్ రావు, రైతు సమన్వయ అన్నారుగూడెం గ్రామ శాఖ అధ్యక్షులు దుగ్గినేని సత్యనారాయణ, ఏఈఓ త్రివేణి, నాగుల్ మీరా, రైతులు పాల్గొన్నారు.