నిజాయితీతో ఆటోవాలా..!

Published: Monday June 28, 2021

హైదరాబాద్, జూన్ 26, ప్రజాపాలన : హాలో! ఆటో కోఠి వస్తావా... ఎమిస్తారు సార్, మీటర్ లేదా! ఉన్నది సార్ పనిచేయక చాలా రోజులవుతుంది సార్. అయినా హైదరాబాద్ కు కొత్తనా సార్. ఆటో జూబ్లి బస్ స్టేషన్ వెల్లాలి బాబు, ఏంత ఇస్తారు మేడమ్- మీటర్ వేయి బాబు. కరోనా మూలంగా మీటర్ లు వీయడం మరచి పోయారు మేడమ్. అయినా మీటర్ వేసి ఆటో నడిపితే మేము బతికేది ఎలా మేడమ్. అన్ని రేట్లు పెరిగినవి ఇక ఆటోవాలా పట్టణంలో బతికేది ఎలా? ఇది చాలా మంది ఆటో వాలాల వరుస. కాని అందరు ఆటో డ్రైవరులు ఇదే తరహా ఉండరని నిజాయితీతో మీటర్ వేసి ఆటో నడిపించే వారు కూడా ఉన్నారని నిరూపించాడు ఒక ఆటో డ్రైవర్. ఆటో.. తార్నాక వస్తావా! ఎంత ఇవ్వాలి? ఆటో డ్రైవర్ సమాధానం తాను మీటర్ వేసి ప్రయాణికులను చేరవేస్తానని ఇంత అయితే వస్తానని డిమాండు చేయను అని అన్నాడు. ఇది విన్న ప్రయాణికుడు ఆశ్చర్యపోయాడు. ఇంకా ఇలా అన్నాడు ప్రయాణికులునా నిజాయితీని గుర్తించి ఎంతో కొంత  మీటర్ రీడింగ్ పైన ఇస్తారని అదే నాకు బరకత్ అని అన్నాడు. ఇంత నిజాయితిగా నడిపిస్తున్న ఆటో డ్రైవర్ లకు సలామ్ చేయలేక ఉండలేము కదా! నిజాయితి బతికే ఉందని నిరూపించాడు అటో వాలా.