ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

Published: Tuesday April 06, 2021
మధిర, ఏప్రిల్ 5, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూరంసెట్టి కిశోర్,మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మిరియాల రమణ గుప్త, మాట్లాడుతూ.. బాబూ జగ్జీవన్‌ రామ్‌ ఒకవైపు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే, మరోవైపు సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరగని సమరం సాగించిన రాజకీయ, సామాజిక విప్లవ యోధుడు బాబూ జగ్జీవన్‌ రామ్‌ అన్నారు అవమానాలు, ఆటంకాలను విజయాలుగా మలుచుకున్న నిజమైన దేశ నాయకుడు జగ్జీవన్‌రామ్‌.. జగ్జీవన్‌రామ్‌ మహోన్నత నాయకత్వం, వ్యక్తిత్వం, సేమ భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థకు, సంస్థకు మహాబలాన్ని చేకూర్చిపెట్టాయి. భారతదేశ స్వరాజ్య ఉద్యమంతో, తదనంతరం జరిగిన దేశ పునర్నిర్మాణంతో ముడిపడిన జగ్జీవన్‌రామ్‌ జీవితం రాజకీయ, సామాజిక, చారిత్రిక ప్రాధాన్యత కలిగి ఉంది. జగ్జీవన్‌రామ్‌ని స్మరించుకోవడం అంటే భారతదేశ స్వాతంత్య్రం, సామాజికోద్యమా ప్రాంగణాన జరిగిన,  ఉప్పొంగిన సమరోజ్వ సమున్నత ఘట్టాను గుర్తు చేసుకోవడమే. అన్నారుఈ కార్యక్రమంలో  బ్లాక్ అధ్యక్షులు చవా వేణు, మధిర మున్సిపల్ కౌన్సిలర్ కోన ధని కుమార్, మధిర నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమాటి నవీన్ రెడ్డి, మండల sc సెల్ అధ్యక్షులు దార బాలరాజు, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అద్దంకి రవి, మండల intuc అధ్యక్షులు కోరంపల్లి చంటి, మండల st సెల్ అధ్యక్షుడు బాలునాయక్, పట్టణ మైనార్టీ అధ్యక్షులు షైక్ జహంగీర్, అల్లినగరం ఎంపీటీసీ చిలకబత్తిని జయరాజు, మాజీ సర్పంచ్ లు కర్నాటి రామారావు, బొమ్మకంటి హరిబాబు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తుమాటి నర్సిరెడ్డి, ఆవుల కిరణ్, షైక్ గౌస్, సూర్యదేవర కోటేశ్వరరావు, యూత్ నాయకులు సురేష్