మధిర పట్టణ రోడ్ మరియు రైలు సంఘం అధ్యక్షులు దొడ్డ రామకృష్ణ విజ్ఞప్తి

Published: Friday April 09, 2021
మధిర, ఏప్రిల్ 8, ప్రజాపాలన ప్రతినిధి : ఖమ్మం జిల్లా వారు మధిర నుండి వివిధ ప్రదేశములు బస్సు సౌకర్యం కల్పించుట గురించి అధ్యక్షులవారు మధిర డిపో మేనేజర్ ను కోరడమైనది ఖమ్మం జిల్లా వారు జగ్గయ్యపేట నుండి పెనుగంచిప్రోలు, మధిర మీదుగా తిరువూరు కు బస్సు ఏర్పాటు చేయమని, మధిర నుండి తిరువూరు నడుపుతున్న బస్సు కు ఉదయం పూట తిరువూరు నుండి ద్వారకాతిరుమల వెళ్ళు బస్సుకు లింక్ ఏర్పాటు చేయగలరని విజయవాడ నుండి కంచికచర్ల, ఎర్రుపాలెం, మధిర, ఖమ్మం, వరంగల్ మీదుగా బాసరకు సర్వీస్ పెట్టగలరని, మధిర నుండి తిరువూరు నడుపుతున్న బస్సులను తోటమూల, గంపలగూడెం, విస్సన్నపేట మీదుగా నూజివీడు కు బస్సు కావాలని మరియు విజయవాడ నుండి మధిర, ఖమ్మం, సిద్దిపేట, కరీంనగర్, వరంగల్ మీదుగా కాలేశ్వరం కు బస్సు ఏర్పాటు చేయమని అడిగినారు మధిర పట్టణ రోడ్డు మరియు రైలు ప్రయాణికుల సంఘ అధ్యక్షులు డివిఆర్ కృష్ణారావు మధిర ఖమ్మం జిల్లా వారు మధిర నుండి వివిధ పట్టణాలను కలుపుతూ నూతన బస్సులు ఏర్పాటు చేయమని కోరినారు మధిర పట్టణం తెలంగాణ రాష్ట్రంలోని మరియు మధిరలో ఒక టి ఎస్ ఆర్టీసీ కి చెందిన బస్సు డిపో కూడా కలదు కావున మధిర పట్టణ ప్రయాణికుల అవసరాలను ఖమ్మం రీజినల్ మేనేజర్, టి ఎస్ ఆర్ టి సి వారు పరిశీలించగలరు విభజిత ఆంధ్ర రాష్ట్ర ఏపీఎస్ ఆర్టీసీ వారు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే అంతర్రాష్ట్ర ఒప్పందం జరిగిన మెదట రెండు రాష్ట్రాల నడుమ నూతన బస్సులు నడుపుటకు టిఎస్ఆర్ టిసి వారికి మాత్రమే అవకాశం కలదు కావున ఈ విషయాన్ని పరిశీలించి పై అధికారులు చొరవ తీసుకుని ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని దీనికి ఒక పరిష్కార మార్గం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను