ఫీల్డ్ అసిస్టెంట్ల ను విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా

Published: Tuesday March 15, 2022
ఇబ్రహీంపట్నం మార్చి 14 ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో నెం 4779 రద్దు చేసి, కనీస వేతన చట్టం ప్రకారం వేతనం పెంచాలని ఫీల్డ్ అసిస్టెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా 13.03.2020 నుండి 19.03.2020 వరకు 07 రోజుల పాటు సమ్మె చేయడం జరిగింది. ప్రభుత్వం వీటిని అమలు చేయకపోగా రాష్ట్రంలో ఉన్న 7,651 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను రాత్రికి రాత్రే సస్పెండ్ చేయడం జరిగిందని ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పంది యాదయ్య, సిఐటియు రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కె.భాస్కర్ డిమాండ్ చేశారు. తిరిగి విధుల్లోకి తీసుకోమని గత రెండు సంవత్సరాలుగా మంత్రులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, పంచాయతీరాజ్ కమిషనర్ లకు, జిల్లా కలెక్టర్లకు ఎన్ని వినతి పత్రలు ఇచ్చిన స్పందన లేదు దీనికి నిరసనగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 7,651 మంది ఫీల్డ్ అసిస్టెంట్ల కుటుంబాలు వీధిన పడ్డాయని వారిని ఆదుకోవాలి, విధుల్లోకి తీసుకోవాలని డిమండ్ చేస్తూ ఇబ్రహీంపట్నం రెవిన్యూ డివిజన్ ఆధికారి కార్యాలయం వద్ద కార్మికులతో ధర్నా నిర్వహించారు. అసేంబ్లి సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేయాలనీ, లేదంటే  పోరాటాలను ఉదృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి జగన్, ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రామచంద్రయ్య, యాచారం మండల ఫీల్డ్ అసిస్టెంట్ల అధ్యక్షుడు కలకొండ జంగయ్య, బాల్ రాజ్, కూమార్, ప్రేమలత, యాదగిరి.దానయ్య, రామలింగం మరియ సిఐటియు రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు డి. జగదీశ్, పెండ్యాల బ్రహ్మయ్య, డి.కిషన్ ఇ.నర్సింహ, జె.ఆశిర్వాదం తదితరులు పాల్గొన్నారు.