మాదాపూర్ గ్రామంలో ఉచిత మెడికల్ క్యాంపు

Published: Saturday July 23, 2022

కోరుట్ల, జూలై 22 (ప్రజాపాలన ప్రతినిధి):
కోరుట్ల మండలంలోని మాదాపూర్ గ్రామంలో జిల్లా సర్పంచ్ పోరం అధ్యక్షులు, మాదాపూర్ స్థానిక సర్పంచ్ దారిశెట్టి రాజేష్  ఆధ్వర్యంలో కోరుట్ల ప్రభుత్వ వైద్య బృందం చేత ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్బంగా  ప్రజలందరికి షుగర్,బీపీ,బ్లడ్ టెస్టులు నిర్వహించారు. టెస్ట్ లు అనంతరం ఉచితంగా మందులు అందించారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ గడ్డం ఆదిరెడ్డి, ఎంపిటిసి కృష్ణా రెడ్డి, ఉప సర్పంచ్ మల్లారెడ్డి, వైద్య బృందం మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.