తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ కు ఘన నివాళి

Published: Tuesday June 22, 2021

పటాన్చెరు, జూన్ 21, ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా పటాన్చెరు పట్టణంలోని  ఆయన విగ్రహానికి టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన తొలి, మలిదశ పోరాటాల్లో జయశంకర్ సార్ పాత్ర మరువలేనిదని వారు కొనియాడారు. నేటి తరానికి ఆయన ఆలోచనా విధానం ఆదర్శప్రాయమన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ హారిక విజయ్ కుమార్, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్, ఆస్పత్రి సలహా సంఘం సభ్యులు కంకర శ్రీను, శ్రీధర్ చారి, గుండమొల్ల రాజు, కోమరగూడెం వెంకటేష్, మతిన్, వినోద్, వీరారెడ్డి, లడ్డు, ఆశం, విద్యాసాగర్, జీవన్, శేఖర్, సందీప్ గిరి, అజ్మత్, అజ్జు, అక్రంపాష, జనార్దన్ రెడ్డి, షోయబ్, శీను తదితరులు పాల్గొన్నారు.