ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ఓటరు అవగాహనా సదస్సు ముఖ్యఅతిథిగా తాసిల్దార్ రావూరి రాధిక హాజరు

Published: Thursday November 10, 2022
బోనకల్, నవంబర్ 9 ప్రజాపాలన ప్రతినిధి: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల లో బుధవారం ఓటర్ నమోదు ఆవగాహనా సదస్సు జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా మండల తహసీల్దారు రావూరి రాధిక పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ విద్యార్దులకు ఓటర్ నమోదు విధానం,ఫార్మ్ 6 ల గురించి వివరించారు. ప్రజాస్వామ్యం లో ఓటు విలువను చెపుతూ, ఎటువంటి ప్రలొభాలకు లొంగకుండా ఓటు వేయాలని సూచించారు. తమ గ్రామాల లోని వారికి కూడా ఓటరు నమోదు గురించి తెలియ చేయ వలసినదిగా సూచించారు . కళాశాల ప్రిన్సిపాల్ నళిని శ్రీ మాట్లాడుతూ అర్హత కలిగిన విద్యార్థు లు అందరు తప్పనిసరిగా ఓటరు గా నమోదు చేయించుకోవాలని అన్నారు . అనంతరం విద్యార్థుల చే ఓటర్ ప్రతిజ్ఙ చేయించారు. ఈ కార్యక్రమంలో గిర్ధవర్ సత్యనారాయణ, కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ రామకృష్ణ , జోనాతన్ బాబు,ప్రసాద్ బాబు, శ్రీనివాస రావు, ప్రభుత్వ కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.