కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాల వల్లనే సింగరేణి ప్రమాదపు అంచుల్లో వుంది. ఐ ఎన్ టి యు సి, జనరల్ సెక

Published: Saturday December 31, 2022
బెల్లంపల్లి డిసెంబర్ 30 ప్రజా పాలన ప్రతినిధి:  కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాల అసమర్ధ నిర్ణయాల వల్లనే, సింగరేణి సంస్థ ప్రమాదపు అంచుల్లో ఉందని ఐఎన్టియుసి జనరల్ సెక్రెటరీ జనక్ ప్రసాద్ అన్నారు.
శుక్రవారం శాంతి ఖని గని పై ఏర్పాటు చేసిన ద్వార సమావేశంలో పాల్గొని మాట్లాడారు,
25 వేల కోట్ల టర్నోవర్ దాటిన సంస్థ కొత్త బొగ్గు బావులు తీసే సత్తా ఉన్నా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం వల్ల ప్రైవేటీకరణకు ద్వారాలు తీస్తున్నారనీ,
 సింగరేణిలో ఇప్పటికే నాలుగు బొగ్గు బ్లాకులను కుట్ర పూరితంగా ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పారనీ,
 ఈ నాలుగు బొగ్గు బ్లాక్ ల కోసం సింగరేణి యాజమాన్యం కోట్లాది రూపాయలు ఖర్చుచేసి మరి అప్పగించిందని అన్నారు.
 ముఖ్యమంత్రి తలచుకుంటే సింగరేణిని ప్రైవేటీకరణ కాకుండా  చూడొచ్చనీ, కాని కుట్రపూరితంగా కార్మికులను మోసం చేస్తూ, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రైవేటీకరణకు మద్దతుగా, రాష్ట్ర ప్రభుత్వం కూడా వంత పాడుతుందని  అన్నారు.
 ఇప్పటికే అసలు అనుభవం లేని అరబిందో కంపెనీకి బొగ్గు బ్లాకులను అప్పజెప్పారని, ఆ కంపెనీ కూడా రాష్ట్ర మంత్రిత్వ శాఖకు సంబంధించిన బందువులదే అని అన్నారు.
 శాంతి ఖని గని లో  సగం పనులు కాంట్రాక్టు వాళ్లతో చేపిస్తున్నారని, శాంతి గనిలో బొల్టర్ మైనింగ్ అనేది ఒక మోసపూరిత పద్ధతని, దాదాపు ఇప్పటికీ నాలుగు సార్లు టెక్నాలజీని మార్చినా, అది ఒక కొలిక్కి రాలేదని దాని ఫలితంగా సంస్థకు నష్టమే తప్ప లాభం లేదని అన్నారు.
గని నుంచి తీసిన బొగ్గు రవాణా  చేయలేని పరిస్థితుల్లో శాంతి గని యాజమాన్యం ఉందని ఎద్దేవా చేశారు.
 సింగరేణి యాజమాన్యం సొంతంగా ఎస్ డి ఎల్ యంత్రాలను కొనుగోలు చేస్తే, శాంతి ఖని గని ఇంకా నలభై సంవత్సరాలు నడిచే అవకాశం ఉందని, దీనివల్ల ఎంతోమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి  సీనియర్ నాయకులు  సిద్దం శెట్టి రాజమౌళి, కేంద్ర కార్యదర్శి కాంపెళ్ళీ సమ్మయ్య , కేంద్ర ప్రచార కార్యదర్శి నరేందర్ , మందమర్రి ఏరియా ఉపాధ్యక్షులు దేవి భూమయ్య , కార్యదర్శులు కుక్కల ఓదేలు ,చంద్రశేఖర్ , విక్రమ్ , ఆరేపల్లి రామయ్య , కనకయ్య , అనిల్ , పిట్ కార్యదర్శి శివ తదితరులు పాల్గొన్నారు.