నమ్మండి ఇది రోడ్డే !!!

Published: Wednesday June 16, 2021

సిద్దిపేట (ప్రజాపాలన ప్రతినిధి ) : తెలంగాణ ధనిక రాష్ట్రం, మిగులు బడ్జెట్ గల రాష్ట్రం ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు చెపుతుండే మాటలు కానీ ఈ ధనిక రాష్ట్రం లో అందునా ముఖ్యమంత్రి సొంత జిల్లా సిద్ధిపేట జిల్లాలో రోడ్ల పరిస్థితి దయనీయంగా ఉంది అంటున్నారు ప్రజానీకం. ఈ చిత్రంలో మీకు కనిపిస్తున్నది బ్రిడ్జిని ఆనుకొని ఉన్న రోడ్డు ఇది సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలోని పిల్లవాగు పైన కల బ్రిడ్జ్ ని అనుకోని ఉన్న రోడ్ గత సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోవడం జరిగింది. ఇప్పటివరకు ఎలాంటి మరమ్మత్తులు చేయలేదు సరికదా ఇటువైపు ఒక్కరంటే ఒక్కరు ప్రజాప్రతినిధి చుసిన దాఖలాలు లేవు. గుగ్గిళ్ల నుంచి కోహెడ మరియు హుస్నాబాద్ వెళ్లే ప్రయాణికులకు మరియు వాగు అవతల గలా వ్యవసాయ భూమి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ఈ రోడ్డుకు అతి తొందరగా మరమ్మతులు చేయగలరని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.ముఖ్యమంత్రి సొంత జిల్లా ఆర్ధిక మంత్రి అన్నింటికీ స్పందిస్తారని పేరున్న జిల్లాలో ఈ పరిస్థితి ఏంటని వాపోతున్నారు ప్రజలు .