ప్రజావాణి సమస్యల పరిష్కారం దిశగా చర్యలు** జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్ పాయి **

Published: Tuesday February 07, 2023
ఆసిఫాబాద్ జిల్లా ఫిబ్రవరి 6 ప్రజాపాలన, 
ప్రతినిధి) : ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను పరిశీలించి సమస్యల పరిష్కారం దిశగా కృషి చేయడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ భవనంలో అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. జిల్లాలోని బెజ్జూర్ మండలం జైహింద్ పూర్ గ్రామస్తులు కొత్తచెరువు ముంపుకు గురైన భూమి నష్టపరిహారం నిధులు అందించాలని కోరుతూ అర్జీ సమర్పించారు.సాధ్కరి లస్మయ్య తాను జనకాపూర్ గ్రామ శివారులో ఉన్నఅనుసంధానాన్ని ఉన్న భూమిని సాగుచేస్తూ జీవిస్తున్నామని, భూమిపై తనకు నూతన పట్టాదార్ పాస్ పుస్తకం మంజూరు చేసి రైతుబంధు వర్తింపచేయాలని కోరారు. నాగల్ గొందికి చెందిన మారుబాయి, సిడాం రాజు, ఆత్రం పగ్గుబాయి తమకు గల పట్టా భూమికి రైతుబంధు డబ్బులు తీసుకున్నామని, ప్రస్తుతం రైతుబంధు డబ్బులు రావడంలేదని, కోరుతూ వేరువేరుగా దరఖాస్తు అందజేశారు. సిర్పూర్ (టి)కి చెందిన సాలిన పర్వీన్ నిరుపేదరాలిని అయిన తనకు ప్రభుత్వం అందిస్తున్న రెండు పడక గదల ఇండ్ల పథకంలో అవకాశం కల్పించి ఇల్లు మంజూరు చేయాలని దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో అందిన ప్రతి దరఖాస్తులు పరిశీలించి సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.e