ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ వర్థంతి

Published: Tuesday June 22, 2021
 కొడిమ్యాల: జూన్ 21 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని విన్నర్స్ పాఠశాలలో సండ్రాళ్ళపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏనుగు ఆదిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ 11వ వర్ధంతి నిర్వహించారు.  ఈ సందర్భంగా జయశంకర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు ఆదిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంత కర్త, పితామహుడు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రావడానికి ఎన్నో ఉద్యమాలు చేసారని, తెలంగాణ వచ్చినప్పుడు ఈయన లేడని అన్నారు. తండ్రి లక్ష్మి కాంతారావు, తల్లి మహా లక్ష్మి లకు 1934లో జన్మించిన జయశంకర్ క్యాన్సర్ వ్యాధితో 2011 జూన్ 21న చనిపోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాంపల్లి మల్లేశం, ఆరేటి వెంకటేశ్వర్లు, బొమ్మ సురేష్, బిజెపి మండల అధ్యక్షులు రేకుల పెళ్లి రవీందర్ రెడ్డి రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు మంద గోపాల్ రెడ్డి, కాయిత అంజయ్య, స్వయం సేవకులు కంచర్ల గంగాచారి, వడ్లకొండ బుచ్చిరాములు, ఎర్రోజు శ్రీనివాస్ చారి, బోనగిరి మల్లేశం, అంకం జనార్ధన్, పిట్టల శ్రీనివాస్, చల్ల శ్రీనివాస్ రెడ్డి,  డాక్టర్ లింగమూర్తి, చిలుక రమేష్ నాంపల్లి శ్రీనివాస్, వెంకటేశ్వర రావు, మల్లికార్జున్, అంజి, తదితరులు పాల్గొన్నారు.