రోడ్డు వెడల్పు లో భాగంగా ఇల్లు కోల్పోతున్న బాధితులను పరామర్శించారు కాంగ్రెస్ పార్టీ జాతీయ

Published: Friday March 11, 2022
ఇబ్రహీంపట్నం మార్చి 10 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మున్సిపాలిటీలో నాగన్ పల్లి వెళ్లే రోడ్డు మార్గంలో రోడ్డు వెడల్పు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం & అధికార యంత్రాంగం అధికారులు. నిరుపేద ప్రజల ఇళ్లను ఎలాంటి నష్ట పరిహారం చెల్లించకుండా, నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడం జరిగింది, ఈ విషయం తెలుసుకున్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి గురువారం రోజు జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి, సీనియర్ నాయకులు లక్ష్మీపతి గౌడ్, EC శేఖర్ గౌడ్, కొత్త కూర్మ శివ కుమార్, దండేo రామ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, శంకర్ గౌడ్, కౌన్సిలర్ మోహన్ నాయక్, తుర్కయంజాల్ మున్సిపల్ కౌన్సిలర్ అనురాధ దర్శన్, ఎంపీటీసీ జయ నందం, నాయకులు కృష్ణ,మాజీ సర్పంచులు బుపతి గళ్ళ రాజు & ఎంపిటిసిలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ఉదెయ్ పాల్ రెడ్డి, మరియు ఎమ్మెన్నార్ యువసేన ప్రెసిడెంట్ కమలాకర్ రెడ్డి, శ్రీహరి, ఎమ్మెన్నార్ టీం సభ్యులు, ఇల్లు కోల్పోయిన బాధితుల కుటుంబ సభ్యులు, ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు బాధితులతో మాట్లాడి వారికి మనోధైర్యాన్ని నింపి, ఇంటి స్థలం, నష్టపరిహారం మరియు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వచ్చేంతవరకు ప్రభుత్వంపై పోరాటం చేసి మీకు న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలిపారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో న్యాయవాదులు మహేష్, రవి కిరణ్, పాల్గొన్నారు, అనంతరం మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడి బాధితులకు న్యాయం చేయాలని నష్టపరిహారం ఇచ్చిన తర్వాతనే పనులు చేపట్టాలని తెలిపారు సానుకూలంగా స్పందించిన కమిషనర్ హర్షం వ్యక్తం చేస్తున్న బాధితులు, ఆపదలో ఇల్లు కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉన్న నత్తి రాములమ్మను మీకు మేము అండగా ఉంటామని ఇల్లు కోల్పోయిన ప్రతి కుటుంబానికి నష్ట పరిహారం అందించే అంతవరకు మేము కృషి చేస్తామని ఆమెకు మనోధైర్యాన్ని అందించారు మాకు మద్దతుగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు బాధితులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు, అనంతరం వినోబా నగర్ లోని జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ ఆశ్రమంలో నేలమట్టమైన ఆశ్రమాన్ని చూసి అనంతరం అధికారులతో మాట్లాడి పునర్ నిర్మించడానికి మా శాయశక్తులా కృషి చేస్తామని తెలిపారు.