వీరులకు మరణం లేదు.

Published: Thursday March 24, 2022
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావులపల్లి రాంప్రసాద్
భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో (ప్రజాపాలన) విప్లవ వీర కిశోరాలు కామ్రేడ్ షాహిద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ల 91వ వర్ధంతి సందర్భంగా భద్రాచలం పట్టణంలోని స్థానిక అంబేద్కర్ సెంటర్ సీపీఐ కార్యాలయంలో అఖిలభారత యువజన సమాఖ్య (ఏ ఐ ఎస్ ఎఫ్) ఖిల భారత విద్యారి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో భగత్సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా రావులపల్లి రాంప్రసాద్ వచ్చి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ ముష్కర పాలన అంతం కోసం,భరత గడ్డకు స్వేచ్ఛ స్వతంత్రం కోసం నూనూగు మీసాల వయసులోనే కామ్రేడ్ భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవ్ లు తిరుగుబావుట ఎగరవేసి విప్లవ మార్గంలో ఉరి తాళ్ళను సైతం ఎగతాళి చేస్తూ చిరునవ్వుతో తమ ప్రాణాలను తృణప్రాయంగా ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినదిస్తూ వారు చేసిన త్యాగం భరత గడ్డ ఎన్నటికి మరిచిపోదని కొనియాడారు. ఆనాటి వీరుల త్యాగాలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చరిత్రను వక్రీకరించి అమరుల త్యాగాలను కించపరిచే విధంగా వక్రీకరిస్తున్నారని ధ్వజమెత్తారు. నేటి పాలక ప్రభుత్వాలు అనుసరిస్తున్న  మత చాందస వాద విధానాలు, సామ్రాజ్యవాద దోపిడీ పాలసీపై తిరుగుబాటు చేసేందుకు భగత్ సింగ్ త్యాగాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఇంట్లో ఒక భగత్ సింగై అంతరాల వ్యవస్థను ధ్వంసం చేస్తూ సమాజం మార్పు కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తమ్మళ్ల వెంకటేశ్వరరావు,సీపీఐ పట్టణ కార్యదర్శి అకోజు సునిల్ కుమార్,. ఏఐటీయూసి పట్టణ కార్యదర్శి బల్లా సాయి కుమార్. ఏ ఐ ఎస్ ఎఫ్ నాయకులు దానియేలు ప్రదిప్. జాడి వెంకట్. ఎస్కె ఖాదర్. వెంకట్రావు. గుడుపల్లి ప్రభు కుమార్. కోవాలి నాగరాజు. హైజాక్. ఏ ఐ ఎస్ ఎఫ్ నాయకులు వంకాపాటి తిరుపతి రావు. కొల్లిపాక శివ. ప్రకాష్. ప్రేమ్. తదితరులు పాల్గొన్నారు.