డిమాండ్ చేస్తూ దిష్టి బొమ్మ దగ్దం

Published: Saturday February 20, 2021

శేరిలింగంపల్లి, ప్రజాపాలన: శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ చౌరస్తాలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సీపీఐ ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ పార్టీ మండల కార్యదర్శి కనకమామిడి శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ పెరిగిన వంట గ్యాస్, పెట్రోల్, డీజల్ రేట్ల వలన సామాన్య ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. కేంద్రంలో ని మోదీ ప్రభుత్వం రోజూ రోజుకూ గ్యాస్, పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచుతూ అదాని, అంబాని ల ఆస్తులను రెట్టింపు చేస్తుందని అన్నారు. పేదలు రోజు పని దొరకక పస్తులుంటున్న పరిస్థితుల్లో అంబానీ లాంటి కార్పొరేట్ శక్తులు గంటకు 90కోట్లు సంపాదిస్తున్నారని తెలిపారు. ప్రజలు అందరూ తిరగబడలని మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని వారు డిమాండ్ చేసారు. ప్రైవేటికీకరణ పేరుతో ఈ దేశాన్ని కార్పొరేట్ శక్తులకు అమ్ముతున్నడాని ఎద్దేవా చేశారు. రానున్న రోజుల్లో పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించకపోతే  పోరాటాలను ఉదృతం చేస్తామని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల సహాయ కార్యదర్శి రామకృష్ణ ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి చందు, ఏ. శ్రీను, చెంచమ్మ, బిపాషా, జయ, ఉమా, ప్రమీల, అప్సర్ బేగం  తదితరులు పాల్గొన్నారు.