ఉప్పల్ అన్నపూర్ణ నగర్ కాలనీ అసోసియేషన్ ఎన్నిక మేడిపల్లి, జనవరి 26 (ప్రజాపాలన ప్రతినిధి)

Published: Friday January 27, 2023
ఉప్పల్ అన్నపూర్ణ నగర్ కాలనీ అసోసియేషన్ కొత్త కార్యవర్గాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాలనీ అధ్యక్షునిగా కె.భరత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా వి.తిరుపతిరెడ్డి, ఉపాధ్యక్షులుగా పి సోమేశ్వర్, యోగేష్, సంయుక్త కార్యదర్శిగా కాసర్ల వెంకట నరసింహ రెడ్డి, కోశాధికారిగా శ్రీకాంత్ రెడ్డి, సలహాదారులుగా చక్రధర్ రావు, ఎం వి ఎల్ కాంతారావు, వి.సూర్యనారాయణ, కృష్ణ గౌడ్, ఎం మల్లారెడ్డి, ప్రొఫెసర్ శివరాజ్, కమిటీ సభ్యులుగా మరో ఐదుగురిని ఎన్నుకున్నారు. కాలనీ అసోసియేషన్ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని కమిటీ నేతలు పేర్కొన్నారు.