దివ్యాంగులకు ఆటల పోటీలు

Published: Wednesday November 23, 2022
జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి లలితా కుమారి
వికారాబాద్ బ్యూరో 22 నవంబర్ ప్రజా పాలన : అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని  ఈనెల 24, 25 తేదీలలో రెండు రోజుల పాటు స్త్రీ, పురుషుల దివ్యాంగులకు స్థానిక బ్లాక్ గ్రౌండ్స్ లో ఉదయం11:00 గంటల నుండి ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారి లలితా కుమారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 10 సంవత్సరాల నుండి 16 సంవత్సరాల వారు జూనియర్లుగా, 17 సంవత్సరాల నుండి 54 సంవత్సరాల వారు సీనియర్లుగా రెండు విభాగాలలో ఆటల పోటీలు నిర్వహించనున్నట్లు ఆమె తెలియజేశారు.  దృష్టి, వినికిడి, శారీరక, మానసిక, వికలాంగులు ఆటల పోటీలలో పాల్గొనవచ్చని ఆమె తెలిపారు. రన్నింగ్, షాట్ పుట్, చెస్, క్యారమ్స్, వీల్ చైర్స్  జావలిన్ త్రో, ట్రై సైకిల్ రేస్ లాంటి ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలియజేశారు.  ఇట్టి ఆటల పోటీలలో మొదటి రెండో స్థానం సాధించిన వారికి రాష్ట్ర స్థాయి ఆటల పోటీలకు పంపడం జరుగుతుందన్నారు. ఆటల పోటీలలో జిల్లాకు చెందిన దివ్యాంగులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.