అభివృద్ధికి మారుపేరు సబితా ఇంద్రారెడ్డి

Published: Friday July 23, 2021
బాలాపూర్, జులై 22, ప్రజాపాలన ప్రతినిధి : మహేశ్వరం నియోజకవర్గ ప్రజలందరికీ అభివృద్ధిలో సబితా ఇంద్రారెడ్డి, ప్రజల వెనువెంటనే ఉన్న నాయకురాలని మీర్ పేట్ కార్పొరేషన్ స్థానిక కార్పొరేటర్లు పేర్కొన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పెద్ద చెరువు సుందరీకరణ భాగంలో ఏడు కోట్ల రూపాయలు టెండర్ పూర్తయిన సందర్భంగా 11వ, 28వ డివిజన్లలో కార్పొరేటర్లు ధనలక్ష్మి రాజ్ కుమార్, జిల్లెల అరుణ ప్రభాకర్ రెడ్డి లతో పాటు కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ల ఆధ్వర్యంలో అభివృద్ధికి మారుపేరు సబితా ఇంద్రారెడ్డిని గురువారం నాడు చెరువు కట్టమీద విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్లు మాట్లాడుతూ..... ప్రజల సంక్షేమల గురించి, ప్రజల క్షేమం గురించి, ఆలోచించే నాయకురాలు సబితా, ప్రజల గుండెల్లో ఉన్నారని ప్రజలే వ్యక్తపరుస్తున్నారు. ఏ ఆపద వచ్చినా, ఏ సమస్య వచ్చినా, నేనున్నానని మనోధైర్యం కలిగించే మహోన్నత వ్యక్తిత్వం కలిగిన నాయకురాలు అని కొనియాడారు. కానీ కొందరు ప్రతిపక్షా వాళ్లు అభివృద్ధి పనులను జీర్ణించుకోలేక పోతున్నారు, కబ్జా చేస్తున్నారని నింద మోపితే, ఎవరు ఊరుకోరు ఖబడ్దార్.... ఇంకోసారి ప్రజల మనిషి, ప్రజల గురించి ఆలోచించే నాయకురాలను తప్పుగా మాట్లాడితే ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. మీర్ పేట్ కార్పోరేషన్ ను అందంతో పాటు ప్రజలకు అనుకూలంగా పార్కులు, వాకింగ్ ట్రాక్, చేయడంలో అభివృద్ధి కాదా ఇవి కనబడతలేవు ప్రతిపక్ష పార్టీలకు అన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి కార్యకర్తలు అభిమానులు మహిళామణులు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్ ముదావత్ దుర్గ దీప్ లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ భూపాల్ రెడ్డి, సిద్ధాల లావణ్య బీరప్ప, కార్పొరేషన్ కార్పొరేటర్స్ ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్, ఇంద్రావత్ రవి నాయక్, అక్కి మాధవి ఈశ్వర్ గౌడ్, సిద్ధల బీరప్ప, మాధవి సాయినాథ్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు జటావత్ రవి నాయక్, కార్యకర్తలు నాగేశ్వరావు, సుదర్శన్, నర్సింగరావు, యాదయ్య, బ్రహ్మానందం, పురుషోత్తం, యాదగిరి, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.