*లేబర్ కమిషనర్ ఆఫీస్ ముందర శాలివాహన పవర్ ప్లాంట్ కార్మికుల నిరాహార దీక్ష*

Published: Saturday January 28, 2023

మంచిర్యాల టౌన్, జనవరి 27, ప్రజాపాలన : లేబర్ కమిషనర్ ఆఫీస్ ముందర శుక్రవారం రోజున శాలివాహన పవర్ ప్లాంట్ కార్మికులు పెండింగులో ఉన్న వేతనాలు, పెండింగులో ఉన్న బోనస్,లు ఇప్పించాలని   నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా శాలివాహన పవర్ ప్లాంట్ కార్మిక సంఘము అధ్యక్షులు కుంటాల శంకర్ మాట్లాడుతూ కంపెనీ పవర్ పర్చేస్ అగ్రిమెంట్ ముగిసిన తరువాత యాజమాన్యం మొండిగా వ్యవహారిస్తోందని కార్మికులకు రావాల్సిన నాలుగు నెలల వేతనాలు, మూడు సంవత్సరాల బోనస్,లు ఇప్పించాలని గత రెండు నెలలగా వినతి పత్రములు ఇచ్చిన యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో  అసిస్టెంట్ లేబర్ కమిషనర్  మంచిర్యాల కార్యాలయం ముందు నిరాహారదీక్ష చేసే పరిస్థితి నెలకొందని అన్నారు, ఇప్పటికైన పెండింగు వేతనాలు, బోనస్ లు ఇప్పించి, వచ్చే అసెంబ్లీ సమావేశాలో శాలివాహన పవర్ ప్లాంట్   నకు మరో పది సంవత్సరాల పాటు పవర్ పర్చేస్ అగ్రిమెంట్ పొడిగించే విదంగా తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక పంపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బి.జె.పి.పార్టీ జిల్లా అధ్యక్షులు వెర్రబెల్లి రఘునాద్ రావు,తూల మధుసూదన్, బి.ఎం.ఎస్.సంఘము రాజు యాదవ్,సంకే రవి, సి.ఐ.టి.యూ.సంఘము జి.ప్రకాష్, జైపాల్ సింగ్, దేవి సత్యం,బి.ఎస్.పి.పార్టీ కాదాసి రవీందర్,  కార్మికులు తదితరులు పాల్గొన్నారు.