TRS పార్టీ బిఆర్ఎస్ పార్టీగా అవతరించడంపై హర్షం వ్యక్తం చేసిన తెలంగాణ ప్రభుత్వ విప్ పినపాక ఎమ్

Published: Friday October 07, 2022

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ప్రజా పాలన.

రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీగా అవతరించినందుకు చాలా సంతోషం వ్యక్తం చేసిన పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు.

కెసిఆర్ సారథ్యంలో బిఆర్ఎస్ పార్టీ దేశంలోని ప్రతి రైతు కుటుంబానికి ,బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి గా బిఆర్ఎస్ పార్టీ వెలుగొందాలని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. నేడు రాష్ట్రంలో అమలవుతున్నటువంటి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మిషన్ భగీరథ, వృద్ధాప్య పెన్షన్, ముఖ్యంగా రైతుబంధు లాంటి పథకాలు దేశంలో కూడా అమలు చేయాలని దేశానికి కేసీఆర్ లాంటి ముందు చూపు ఉన్న వ్యక్తి ఇప్పుడు ఎంతైనా అవసరమని అలాంటి వ్యక్తిని మనం దేశ రాజకీయాల్లోకి తీసుకొని రావాలని అలాంటి వ్యక్తి ద్వారానే ప్రతి ఒక్క సామాన్యుడు యొక్క అవసరాలు బాధలు తీర్చగలిగే సత్తా ఒక్క కేసీఆర్ కి మాత్రమే ఉన్నదని ఆయన అన్నారు. నేడు మనం చూస్తున్నట్లయితే బిజెపి యొక్క పాలన కులాలతోనే మతాలతోని మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల్ని విబజీంచి, పాలించులాగా చేస్తుందని ఎవరికీ కూడా ఎక్కడ న్యాయం జరగట్లేదని వారు అన్నారు. నేడు దేశంలో మనం గమనించినట్లయితే పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలు రేట్లు ఏ విధంగా పెరిగిపోయాయో మనం గమనిస్తున్నాము. వీటన్నిటికీ కారణం నరేంద్ర మోడీ యొక్క అవగాహన లేని పాలన వల్లే ఈ విధంగా జరుగుతుందని ఆయన అన్నారు. అంతేకాకుండా బిజెపిలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం నల్లధనం వెనుకకు తీసుకువస్తానని ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఇస్తానని ఆరోజు అన్నారని మరి అవి నల్లధనాన్ని ఎందుకు వెనక్కి తీసుకురాలేకపోయారని వారు ప్రశ్నించారు.కాబట్టి రైతులకు గిట్టుబాటు ధర కావాలన్నా రైతుబంధు కావాలన్నా, షాదీ ముబారక్, మిషన్ భగీరథ లాంటి , కళ్యాణ లక్ష్మి, పథకాలు మంచి మంచి పథకాలు కావాలన్నా కేసీఆర్ లాంటి వ్యక్తిని దేశ రాజకీయాల్లోకి తీసుకొని వస్తేనే పేద బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి గా నిలుస్తాడని వారు చెప్పారు.