రజకుడు పై విచక్షణా రహిత దాడి

Published: Tuesday October 26, 2021
దెబ్బలకు తట్టుకోలేక  పురుగు మందు త్రాగిన బాధితుడు
బోనకల్, అక్టోబర్ 25 ప్రజాపాలన ప్రతినిధి : మండల పరిధిలోని చిరునోముల గ్రామంలో రజక కులానికి చెందిన బీరెల్లి మల్లయ్య (53) పై అదే గ్రామానికి చెందిన చెక్కిలాల నాగేశ్వరరావు మల్లయ్య ఇంటిపై దాడి చేసి విచక్షణారహితంగా ముఖము పై పిడి గుద్ధులు గుద్ది తీవ్రంగా గాయపరచి నాడు. మన గ్రామంలోజీవించే హక్కును హరించే హక్కు ఎవరికీ లేదని భారత రాజ్యాంగంలో పొందుపరచి యుంది. ఎవరైనా సరే ఎవరి పట్లనైనా తప్పుగా అసభ్యకర వ్యాఖ్యలు చేసిన, నోరు జారిన తదుపరి పెద్దమనుషుల ద్వారా పంచాయితీ పెట్టాలి లేకపోతే న్యాయం కోసం చట్టప్రకారం పోలీసులను ఆశ్రయించాలి  అని లేదా  న్యాయస్థానానికి వెళ్ళాలి కానీ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసు కోవచ్చని ఏ రాజ్యాంగం లోనూ రాయలేదు. భారత రాజ్యాంగంలో చెప్పినట్లు అందరూ చట్టం పరిధికి లోబడి మాత్రమే ఉండాలి అని అన్నారు. గాయ పడిన వ్యక్తి దెబ్బలకు తట్టుకోలేక పురుగుల మందు తాగడం జరిగింది. గాయపరిచిన వ్యక్తిని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు. నాలుగు రోజులుగా  ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మల్లయ్య మృతి చెందడం జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం బాధితుడు చావుకు కారణమైన నాగేశ్వరరావును వెంటనే శిక్షించాలని కుటుంబ సభ్యులు బోనకల్ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు ఆ వ్యక్తిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.