రామంతాపూర్ భగాయత్ కాలనీలకు కొత్త ఇంటి నెంబర్లు కార్పొరేటర్ శ్రీవాణి వెంకట్రావు

Published: Thursday November 10, 2022
మేడిపల్లి, నవంబర్ 9 (ప్రజాపాలన ప్రతినిధి)
రామంతాపూర్లోని భగాయత్ కాలనీలకు కొత్తగా ఇంటి నెంబర్లను కేటాయించాలని మున్సిపల్ అధికారులకు స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు సూచించారు. ఈ మేరకు కార్పొరేటర్ మున్సిపల్ అధికారులు, కాలనీవాసులతో కలిసి 
 రామంతపూర్లోని భగాయత్ కాలనీలలో పర్యటించారు. కాలనీలలోని అన్ని ఇండ్లను సర్వే చేయించి ఈ సేవలో సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకున్న వాళ్లందరికీ ఇంటి నెంబర్లు ఇవ్వవలసిందిగా కార్పొరేటర్  బండారు శ్రీవాణి వెంకట్రావు కోరారు. దానికి అధికారులు స్పందిస్తూ అతి త్వరలో కొత్త ఇంటి నెంబర్లను  ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు మరియు డివిజన్ బిజెపి అధ్యక్షులు బండారు వెంకట్రావు, నాయకులు, కాలనీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.