వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

Published: Monday March 14, 2022

సారంగాపూర్, మార్చి 13 (ప్రజాపాలన ప్రతినిధి): సారంగాపూర్ మండల్ పెంబట్ల శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి దేవాలయంలోని వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ అధికారులు నాయకులు పట్టు వస్త్రాలు పూలు పండ్లు సమర్పించి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోల జమునశ్రీనివాస్ జడ్పీటీసీ మేడిపల్లి మనోహర్ రెడ్డి వైస్ ఎంపీపీ సోల్లు సురేందర్ ఈవో కాంతారెడ్డి వ్యవస్థాపక ధర్మకర్త పోరండ్ల శంకరయ్య సర్పంచులు బొడ్డుపల్లి రాజన్న ఆకుల జమున ఆలయ అధికారులు రజినీకాంత్ రవి ధర్మకర్తలు తదితరులు పాల్గొన్నారు