కరోనాని ఆరోగ్య శ్రీ లో చేర్చాలి

Published: Friday June 11, 2021

పరిగి 10 జూన్, ప్రజాపాలన ప్రతినిధి : కోవిడ్-19 నియంత్రణా చర్యలపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు ,  మరియు తహసీల్దార్లకు దళిత్ శక్తి ప్రోగ్రాం(DSP) రిప్రజెంటేషన్స్ గురువారం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 18 ఏళ్ళు నిండిన వారందరికీ ఇంటివద్దనే ఉచిత కొవిడ్ టీకాలు (వ్యాక్సినేషన్) అందించి కరోనా బారిన పడ్డ బాధితులందరికీ పూర్తి ఉచిత వైద్యం అందించాలని కోరారు. అలాగే కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలని వారు డిమాండ్ చేశారు. ప్రతి గ్రామంలో ఉచిత కరోనా చికిత్స కేంద్రాలను (తాత్కాలిక గుడారాలు/టెంట్ లను) నిర్మించి కరోనా బారిన పడ్డ పేద కార్మిక కుటుంబాలకు నిత్యావసర సరుకులు, ఆర్థిక సహాయం మరియు నూట్రిషన్ ఫుడ్ ప్యాకెట్స్ (పౌష్టికాహార పాకెట్లు) ప్రభుత్వమే అందించాలని, కరోనా కారణంగా స్కూల్స్ లేనందున ఆన్లైన్ తరగతులకు హాజరవుతున్న ఎస్సీ ఎస్టీ బిసి  విద్యార్థులందరికీ స్మార్ట్ ఫోన్స్/ ట్యాబ్స్ ప్రభుత్వమే ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.