మొక్కలు నాటిన కోడేం వెంకటేశ్వర్లు మరియు పిల్లి రవి వర్మ.... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గ

Published: Friday September 23, 2022
మొక్కలే మానవునికి జీవనాధారం అని  సర్పంచ్ కోడే0 వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలోని కృష్ణశాగర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఆవరణంలో  ఫెన్సింగ్  వేసి మొక్కలను స్థానిక సర్పంచ్ వెంకటేశ్వర్లు, స్థానిక గ్రామపంచాయతీ సెక్రటరీ నవీన్, జాతీయ మాల మహానాడు పినపాక నియోజకవర్గం అధ్యక్షులు పిల్లి రవి వర్మ ఆధ్వర్యంలో  గురువారం  మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జాతీయ మాల మహానాడు పినపాక నియోజకవర్గం అధ్యక్షులు పిల్లి రవివర్మ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం గర్వంగా ఉందని అన్నారు. అదేవిధంగా పార్లమెంటు భవనానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి ముఖ్య మంత్రి కేసీఆర్ పంపడం సంతోషకరమని తెలిపారు. దళితుల అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోవింద్,  బి బాబురావు, పి నారాయణ, బద్రి, రాముడు తదితరులు పాల్గొన్నారు.