దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలతో బోనాల ఉత్సవాలు ప్రారంభం

Published: Thursday August 05, 2021

గుమ్మడిదల, ఆగస్టు 04, ప్రజాపాలన ప్రతినిధి : మండల కేంద్రంలో దుర్గమ్మ బోనాల ఉత్సవాలు అర్చకుల వేదమంత్రోత్సవాలతో గణపతి పూజ, నవగ్రహాల పూజ, అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, హోమం, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలు అంగరంగవైభవంగా నిర్వహించారు. అనంతరం వంశపర్యంపర పొచ్చుగారి వంశీయుల ఆధ్వర్యంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు, ఒడి బియ్యలు సమర్పించి, గొర్రె పొట్టేళ్లతో ఫలహారం బండి, పోతారాజుల విన్యాసాలతో  గ్రామ పురవిద్దులో కన్నుల పండుగ ఊరేగింపు సాగింది, అనంతరం మహిళ భక్తులు దుర్గమ్మ అమ్మవారికి బోనాలను, ఒడిబియ్యలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిమ్ముల నర్సింహారెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్షుడు మద్దుల బాల్ రెడ్డి, కమిటీ ఉపాధ్యక్షులు కాలకంటి రవీందర్ రెడ్డి, పుట్ట నర్సింగరావు, రామగౌడ్, ఆకుల సత్యనారాయణ ప్రధానకార్యదర్శి సూర్యనారాయణ, కోశాధికారి ప్రకాష్ రెడ్డి, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మల్లారెడ్డి, ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షులు శ్రావణ్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, పాలక వర్గం సభ్యులు ఉప సర్పంచ్ మొగులయ్య, ఎంపిటిసి పద్మ కొండల్ రెడ్డి, వార్డు సభ్యులు ఆకుల ఆంజనేయులు, అతినారం రాము, పొచ్చుగారి చంద్రారెడ్డి, శ్రీనివాసరెడ్డి, దేవేందర్ రెడ్డి, వాసుదేవ రెడ్డి, కృష్ణారెడ్డి, పాపిరెడ్డి, రవీందర్ రెడ్డి, కుమ్మరి రాజు, గ్రామ పెద్దలు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు