ఉపాధ్యాయులందరూ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆదర్శంగా తీసుకోవాలి: సర్పంచ్ మర్రి తిరుపతిరావు

Published: Tuesday September 06, 2022

బోనకల్, సెప్టెంబర్ 5 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని ఆళ్లపాడు ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు రమేష్ అధ్యక్షతన జరిగిన సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకల సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుక లతొ శుభాకాంక్షలు తెలియజేస్తూ గ్రామ లో ఉన్నా కూరకుల వెంకయ్య ఐఎఫ్ఎస్ జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు శాలువాలతో సత్కారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఉపాధ్యాయులందరూ ఎంతో ఉన్నత విద్యను అభ్యసించి గురువులుగా నేటి విద్యార్థులు లను రేపటి పౌరులుగా తీర్చిదిద్దినందుకు భావి తరాలకు ఉన్నత విద్యను అందించుటకు కృషి చేస్తున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఈ సత్కారం అనేది పిల్లల భవిష్యత్తు మార్పు కోసం పనిచేయాలని సర్వేపల్లి రాధాకృష్ణ ను ఆదర్శంగా తీసుకొని ఆయన సేవలను గుర్తుచేసుకొని ఎంతో ఉన్నత విద్యను అందించి భావితరాలకు గుర్తుండే విధంగా నాడు చేసిన కృషి ఫలితంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని సెప్టెంబర్ 5న ప్రకటించడం జరిగిందని సర్పంచ్ మర్రి తిరుపతిరావు అన్నారు. దేశ భవిష్యత్తును మార్చేదిశగా విద్యార్థులు చాక సఖ్యమైన విద్యను అభ్యసించే నాటి తరానికి గుర్తుండే విధంగా నేటి తరం భావి పౌరులుగా ఉపయోగపడాలని కొనియాడారు. గ్రామానికి గురువులైనటువంటి ఉపాధ్యాయులను సన్మానించడం అంటే నేటి తరానికి విద్యార్థి భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ సత్కారం ఉపయోగపడాలని కొనియాడారు. ప్రధానోపాధ్యాయులు రమేష్ మాట్లాడుతూ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యార్థులచే ఉపాధ్యాయులుగా బోధించే ఏర్పాటు చేసి పిల్లల్లో ఉన్న చైతన్యాన్ని గుర్తించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు .అనంతరం నైపుణ్యత కలిగిన విద్యార్థులను గుర్తించి వారికి సర్పంచ్ మర్రి తిరుపతిరావు చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సర్పంచ్ మర్రి తిరుపతిరావు, ప్రధానోపాధ్యాయులు ఏ రమేష్ , రవి ,ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, బి రమేష్, రవి కూమార్, పుష్పవల్లి ,శ్రీదేవి, సుభాని, సరోజ పాల్గొన్నారు.