వికారాబాదులో వృద్ధుడి వినూత్న నిరసన

Published: Friday August 27, 2021
చేతిలో తలగోరు నోటివెంట కేసీఆర్ డౌన్ డౌన్ నినాదాలు
వికారాబాద్ బ్యూరో 26 ఆగస్ట్ ప్రజాపాలన : వర్షాల కారణంగా తన ఇల్లు ఉరుస్తున్నందున తీవ్ర సమస్యలు ఏర్పడుతున్నాయని రాజీవ్ గృహకల్పకు చెందిన వృద్ధుడు కృష్ణ (73) పట్టణ వీధుల్లో వినూత్న నిరసన గురువారం చేపట్టాడు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని రాజీవ్ గృహకల్పలో మొదటి అంతస్థులో నివాసం ఉంటున్నాడు. భారీ వర్షాల వలన మొదటి అంతస్థులో నివాసం ఉంటున్న ఇంటి పైకప్పు తీవ్రంగా ఉరుస్తున్నది. వర్షం నీరంతా ఇంటిలో జామవుతున్నాయి. ఇంటిలో జామైన నీటిని కిందికి పారబోస్తే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న కుటుంబ సభ్యులతో తీవ్ర గొడవలు అవుతున్నాయి. మా ఇంటి పైకప్పును ఉరువకుండా బాగుచేయాలని సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు ఇచ్చిన ఫిర్యాదులను ప్లకార్డుకు అతికించి ప్రధాన రహదారుల గుండా తిరుగుతూ సిఎం కేసిఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశాడు. వికారాబాద్ నూతన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార భారీ ర్యాలీ తీస్తున్న సమయంలో వృద్ధుని నిరసనతో ఆశ్చర్యచకితులయ్యారు. చేతిలో తలగోరి పట్టుకొని, నుదుటిపై రూపాయి బిళ్ళ పెట్టుకొని రామయ్య గూడ రోడ్డు నుండి ప్రధాన రోడ్ల గుండా నిరసన చేపట్టాడు. తన ఇంటి సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వ కార్యాలయాల్లో అనేకసార్లు ఇచ్చిన వినతి పత్రాలను పోస్టర్ పై అతికించి భుజానికి కట్టుకొని, దీనికి తోడు అర్ధ నగ్న ప్రదర్శన చేస్తూ కెసిఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపాడు.