కేంద్ర మంత్రివర్గంలో అన్ని వర్గాలకు సముచిత స్థానం

Published: Monday July 12, 2021
బాలాపూర్, జూలై 11, ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రానికి చెందిన జి. కిషన్ రెడ్డికి కేబినెట్ పదోన్నతి ఇచ్చిన  ప్రధాని మంత్రి నరేంద్ర మోడీకి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ అభినందనలు తెలుపుతూ, మీర్ పేట్ ఓబీసీ మోర్చా అధ్యక్షులు రమేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో జిల్లెలగూడ చౌరస్తా వివేకానంద విగ్రహం వద్ద ప్రధాని నరేంద్రమోడీ చిత్రపటానికి పాలాభిషేకం శనివారం నాడు చేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జి అందెల శ్రీరాములు యాదవ్ పాల్గొని, ఈ సందర్భంగా శ్రీ రాములు యాదవ్ మాట్లాడుతూ..... కేంద్ర మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెద్దపీట వేశారని కొనియాడారు. అన్నివర్గాలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చి దేశప్రజలను గౌరవించారని అందెల అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రిగా జీ.కిషన్ రెడ్డికి పదోన్నతి కల్పించి తెలంగాణ ప్రజలను ప్రధాని మంత్రి నరేంద్రమోడీ, అమిత్ షా, జాతీయ అధ్యక్షలు నడ్డా వారికి అభినందనలు గుర్తుచేశారు. కిషన్ రెడ్డి హయాంలో తెలుగు రాష్ట్రాల్లో సాంసృతిక, పర్యాటక శాఖలను అభివృద్ధి జరుగుతుందని, ఆశాభావం వ్యక్తంచేశారు. బీసీ కమిషన్ సభ్యులుగా తల్లోజు ఆచారికి కేంద్రం అవకాశం ఇచ్చి బీసీలను గౌరవిస్తే... రాష్ట్రంలో మాత్రం సీఎం కేసీఆర్ ఆయా వర్గాలను విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మంత్రి నరేంద్రమోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం మీర్ పేట కార్పొరేషన్ అధ్యక్షులు పెండ్యాల నరసింహ్మ, ఫ్లోర్ లీడర్ కీసర గోవర్ధన్ రెడ్డి, బీజేపీ కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శులు గాజుల మధు, కే సోమేశ్వర్, కార్పొరేటర్లు భిక్షపతి చారి, మద్ది రాజశేఖర్ రెడ్డి, భీమ్ రాజు, కీసర హరినాథ్ రెడ్డి, చవ్వ శ్రవణ్, పద్మ నరసింహ్మ యాదవ్, మీర్ పేట్ మహిళా మోర్చా అధ్యక్షురాలు లీలా రవి నాయక్, సీనియర్ నాయకులు శూల ప్రభాకర్, గడ్డం జగన్, నాగరాజు, యాదగిరి యాదవ్, సిద్దిపేట ప్రభాకర్ రెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు రాజశేఖర్, తిరుపతిరెడ్డి, గోపీనాథ్ స్వామి, మహిళా నాయకురాలు రజని, సుధాకర్, రఘుమారెడ్డి, స్వామి సహా బీజేపీ నాయకులు, బీజేవైఎం నాయకులు అందరూ కలిసి పాలాభిషేకం చేశారు.