వార్డెన్ పోస్ట్ ను వెంటనే భర్తీ చేయాలి

Published: Tuesday February 15, 2022
ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దుంపల కుమార్ డిమాండ్.
మంచిర్యాల టౌన్, ఫిబ్రవరి14,ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా భారత విద్యార్థి ఫెడరేషన్   ఆధ్వర్యంలో భీమారం మండల కేంద్రంలో ఉన్న ఎస్టీ బాలుర ఆశ్రమ పాఠశాలను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దుంపల కుమార్ మాట్లాడుతూ, ఆశ్రమ పాఠశాలలో  హాస్టల్ వార్డెన్ గత నెలరోజుల కిందట బదిలీపై వెళ్లడం జరిగింది. బదిలీపై వెళ్లిన అనంతరం వార్డెన్ పోస్టు భర్తీ చేయకుండా , ఇన్చార్జి బాధ్యతలు ఎవరికి ఇవ్వకుండా  అలాగే ఉంచి నా అధికారులు, దీని గురించి సంబంధిత పాఠశాల హెచ్ ఎం ని అడిగితే  హాస్టల్ గురించి నాకు ఏమీ తెలియదని, నాకు సంబంధం లేదు అంటూ  చెప్పారు అని అన్నారు. దీంతో నిత్యం విద్యార్థులకు అసలు ఎవరు భోజనం పెడుతున్నారు,ఎవరు చూసుకుంటున్నారు, విద్యార్థులకు రక్షణ కు ఎవరు అని,అసలు హాస్టల్ లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడుతుందని.వీటి పైన అనేక  సందేహాలు వస్తున్నాయని. గత మూడు సంవత్సరాలుగా పనిచేయని ఆరో వాటర్ ప్లాంట్,విద్యార్థుల పోస్టికాహారం అందించే అటువంటి మెనూ పూర్తిగా అమలు కావడం లేదని.  భోజనం రుచిగా ఉండటం లేదని. ఇప్పటికైనా ఉన్నతాధికారులు హాస్టళ్ ను సందర్శించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని లేని యెడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని  హెచ్చరిస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి ఐటి పాములా  సానిత్, మండల ఉపాధ్యక్షుడు ఆరెందల రవితేజ సభ్యులు అజయ్,సాయి,తదితరులు పాల్గొన్నారని తెలిపారు.