రాహూల్ గాంధీ సభ్యత్వ రద్దు, ప్రజాస్వామ్యంపై గొడ్డలి పెట్టు* *మోడీ నిరంకుశ పాలనను ప్రశ్నించి

Published: Wednesday March 29, 2023

చేవెళ్ల మార్చి 28(ప్రజాపాలన):-


రాహుల్ గాంధీ సభ్యత్వ రద్దు ప్రజాస్వామ్యంలో చీకటి రోజు అని సున్నపు వసంతం అన్నారు.
చేవెళ్ల మండలకేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పై అనర్హత వేటుకు నిరసనగా సత్యగ్రహ దీక్ష  చేపట్టారు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మాజీ డిసిసి అధ్యక్షులు పడ్డాల వెంకట్ స్వామి,పామేనా భీంభరత్,చింపుల సత్యనారాయణ రెడ్డి,షాబాద్ దర్శన్,పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..... రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు యావత్ ప్రజాస్వామ్యానికి తీరని మచ్చ అని అన్నారు.కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయడం సమంజసం కాదని అన్నారు. భారత్ జోడో యాత్రకు అన్ని వర్గాల ప్రజల నుండి వచ్చిన ఆదరణను జిర్ణించుకోలేక సభ్యత్వం రద్దు చేసారనీ అన్నారు. దేశ స్వతంత్ర పునాదికి రాహుల్ గాంధీ కుటుంబం రక్తం దరపోసిందని గుర్తు చేశారు. భారత్ జూడో యాత్రకు అన్ని వర్గాల ప్రజల నుండి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక పార్లమెంట్లో ప్రజల పక్షాన రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రశ్నించేవారు ఉండోదాని ప్రజల పక్షాన నిలుస్తున్న వారిని ఇబ్బంది పెట్టేందుకు బిజెపి కుట్ర పూరిత రాజకీయాలు చేస్తుందన్నారు.ఆర్థిక నేరాలు చేసిన వారి పేరు చివర మోడీ పేరు ఉన్నదని ప్రస్తావించి మాట్లాడితే రెండేళ్లు శిక్ష విధించి చట్టపరంగా అనర్హత ప్రకటించడం దారుణమని అన్నారు. రాహుల్ గాంధీ సభ్యత్వ రద్దు చేయడాని ప్రతి ఒక్కరు ఖండించాలని అన్నారు. బిజెపి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక నిరంకుశ విధానాలను ప్రజలు గమనిస్తున్నారని రాబోవు రోజుల్లో బిజెపి పార్టీని బొంద పెడతారని అన్నారు. కార్పొరేట్ శక్తులకు లబ్బి మోడి ప్రభుత్వ ఎజెండా అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉదయమోహన్ రెడ్డి,వీరేందర్ రెడ్డి,మధుసూదన్ గుప్తా, పెంటరెడ్డి,మద్దెల శ్రీనివాస్,మనయ్య, వెంకటయ్య, గోనె ప్రతప్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్,ప్రసాద్, మధుసూదన్ రెడ్డి, భార్గవ్ రామ్, వివిధ గ్రామల సర్పంచ్ లు,ఎంపిటిసిలు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.